Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్డేట్!
ABN, Publish Date - Mar 25 , 2024 | 01:59 PM
Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో రోజుకో కీలక విషయం బయటికొస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే...
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో రోజుకో కీలక విషయం బయటికొస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రణీత్‌రావు (Praneeth Rao) కస్టడీ ద్వారా కీలక విషయాలను రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఏ1 నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు (Prabhakar Rao) కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. ఆయన అమెరికాలో ఉండటంతో పోలీసులకు ఒకింత కష్టమైంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కేసులో బిగ్ అప్డేట్ వచ్చినట్లుగా తెలిసింది. ఈ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారికి టచ్‌లోకి వచ్చినట్లుగా సమాచారం. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని.. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ వస్తానని ఫోన్‌లో చెప్పారట.
AP Elections: రఘురామను కాదని శ్రీనివాసవర్మకు టికెట్.. ఇంతకీ ఎవరీయన..!?
ఫోన్‌లో ఏం చెప్పారు..?
ఆ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావుకు మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ‘ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు మేం కూడా ప్రభుత్వం చెబితే పనిచేశాం. ఎంతైనా మనం పోలీసులం.. మనం.. మనం ఒకటి. మా ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేస్తున్నారు..?’ అని సదరు ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు ప్రశ్నించారు. దీంతో ఆయన చెప్పిన మాటలన్నీ విన్న ఆ ఉన్నతాధికారి.. ‘మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్‌కు పూర్తిగా సమాధానం రాసి పంపండి’ అని బదులిచ్చారు. దీనికి స్పందించని ప్రభాకర్ రావు ఫోన్ చేయడం గమనార్హం. కాగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌పై కేసు నమోదైన తర్వాత.. తిన్నగా ఆయన అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ ఆదేశాల మేరకే హార్డ్ డిస్కులను ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్లు విచారణలో నిగ్గు తేలింది. ప్రస్తుతం వాటిని రికవరీ చేసిన పోలీసులు.. డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు.
ఇదీ అసలు సంగతి..!
విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయడానికి ప్రభాకర్‌రావు ఆదేశాలే కారణమని భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనక బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత ఉన్నట్లు విచారణలో తేలిపోయింది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు కీలక నిందితులు విచారణలో చెప్పిన పేరు ప్రభాకర్‌రావు. ఆయన ఆదేశాలతో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ప్రభాకర్‌రావు కూడా పాత్రధారి అని దర్యాప్తు అధికారులు ఖరారు చేశారు. సూత్రధారులు ఎవరనేది తెలియాలంటే ప్రభాకర్‌రెడ్డి అరెస్టు కావాల్సిందేనని చెబుతున్నారు. ఆయనను విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ల ట్యాపింగ్ చేశారో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ప్రధాన సూత్రధారులకు వ్యతిరేకంగా కేసు బలంగా ఉండాలంటే ప్రభాకర్‌రావు వాంగ్మూలం కీలకమని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 25 , 2024 | 02:10 PM