Secunderabad Cantonment: జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై బోర్డు మెంబర్ రియాక్షన్!
ABN, Publish Date - Jul 08 , 2024 | 01:29 PM
Telangana: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం వ్యవహారంపై కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఘన చరిత్ర ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్‌ను చిన్న చూపు చూశాయన్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీలో విలీనంపై ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు.
హైదరాబాద్, జూలై 8: జీహెచ్‌ఎంసీలో (GHMC) కంటోన్మెంట్‌ను (Secunderabad Cantonment) విలీనం వ్యవహారంపై కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఘన చరిత్ర ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్‌ను చిన్న చూపు చూశాయన్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీలో విలీనంపై ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు. 80% కంటోన్మెంట్ ప్రజలు జీహెచ్‌ఎంసీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
Telangana: తెలంగాణపై టీడీపీ ఫోకస్.. టార్గెట్ జీహెచ్‌ఎంసీ..!
గతంలో బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ భూములపై కన్నేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తులకు అనుమతులు ఇచ్చి కాంక్రీట్ జంగిల్‌గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉందన్నారు. జీహెచ్ఎంసీలోనే పాలన అధ్వానంగా ఉందని... అందులో కంటోన్మెంట్‌ను విలీనం చేసి ప్రజలను ఇంకా ఇబ్బందులకు గురిచేస్తారా అంటూ బోర్డు మెంబర్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana: తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకం..
Abhishek Sharma: రికార్డు సెంచరీ చేసిన అభిషేక్ శర్మ.. అతడు ఆడిన బ్యాట్ ఎవరిదంటే..!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 08 , 2024 | 04:57 PM