TG News: ఆస్తి కోసం బావ ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే
ABN, Publish Date - Sep 14 , 2024 | 01:08 PM
Telangana: ఆస్తికోసం సొంత బావమర్దినే పొట్టనపొట్టుకున్నాడు బావ. సుపారీ ఇచ్చిన మరీ బావమర్దిని ప్రాణాలు తీశాడు బావ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల ఒకటో తారీకు నా ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య కేసు నమోదు అయ్యింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: సమాజంలో రాను రాను మానవత్వం మంటగలిసిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఆస్తి కోసం సొంత వాళ్లనే పొట్టనపొట్టుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. డబ్బు ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అనే దుస్థితి దిగిజారిపోతున్నారు. ఆస్తి మాత్రమే చాలు ఎలాంటి బంధాలు వద్దనుకుంటున్నారు. డబ్బే ప్రపంచం అన్న చందంగా డబ్బు, ఆస్తికోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. ఆస్తికోసం సొంత బావమర్దినే పొట్టనపొట్టుకున్నాడు బావ. సుపారీ ఇచ్చిన మరీ బావమర్దిని ప్రాణాలు తీశాడు బావ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Aadhaar Card: గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ తేదీ మళ్లీ పొడిగింపు
ఈనెల ఒకటో తేదీన హైదరాబాద్‌లోని (Hyderabad) గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య కేసు నమోదు అయ్యింది. గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్ వెనుక బాలాజీ పీజీ హాస్టల్‌ను మృతిని బావ నిర్వహిస్తున్నాడు. మృతుడు యశ్వంత్(25) అదే హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం వేటలో ఉన్నాడు. అయితే అప్పుల ఊబిలో చిక్కుకున్న నిందితుడు.. ఆస్తి కోసం సుపరి ఇచ్చి మరీ సొంత బావమర్ది యశ్వంత్‌ను హత్య చేయించాడు. ఆపై ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని నిందితులు చిత్రీకరించారు. అనంతరం నెల్లూరు జిల్లా కాలాలిలో మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఖననం చేశారు.
YS Jagan: అహంకారమే జగన్‌కు కష్టాలు తెచ్చిపెట్టిందా..
అయితే యశ్వంత్ మృతిపై అనుమానం వచ్చిన మృతుని తండ్రి నిన్న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హత్య కేసుగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు మృతుని బావను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆస్తి కోసం సొంత బావమర్ది యశ్వంత్‌ను హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నారు. సుపారీ తీసుకున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. యశ్వంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య అని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
YS Jagan: పేరుకు పరామర్శ యాత్ర.. చేసింది మాత్రం..
Viral: ఓర్నీ.. లీవ్‌లెటర్ ఇలా ఎవరైనా రాస్తారా? స్టూడెంట్ రాసిన లెటర్ చూసి అవాక్కైన టీచర్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 14 , 2024 | 02:13 PM