BRS: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’: హారీష్ రావు
ABN, Publish Date - Nov 29 , 2024 | 10:09 AM
దీక్షా దివస్ ... నవంబరు 29న బీఆర్‌ఎస్ జరుపుకునే దీక్షా దివస్ మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపుతిప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన రోజు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: దీక్షా దివస్ (Deeksha Divas) ... నవంబరు 29న బీఆర్‌ఎస్ (BRS) జరుపుకునే దీక్షా దివస్ మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపుతిప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన రోజు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా కామెంట్స్ చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు అని.. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి.. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం అని.. ఇన్నేళ్ళు గడిచినా ఆ నాటి పరిస్థితులు ఇంకా తన ముందు కదలాడుతూనే ఉన్నాయని.. కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘The Coalition Years: 1996-2012’ పుస్తకంలో కేసిఆర్ నిబద్ధత గురించి ఇలా ప్రస్తావించారని హరీష్ రావు అన్నారు. ‘‘కేంద్ర మంత్రిగా మీకు ఏ శాఖ కేటాయించాలి అని అడిగినప్పుడు కేసీఆర్ ఇచ్చిన సమాధానం.. ప్రణబ్‌జీ, నా లక్ష్యం మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ శాఖను కేటాయించారనేది ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా నాకు సమ్మతమే. కానీ దయచేసి తెలంగాణను ఇవ్వండి.” ఇదీ కేసీఆర్ అంటే. ఇదీ ఆయన కమిట్మెంట్.. కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ. కేసిఆర్ ఉద్యమ ఫలితం తెలంగాణ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
మూసీపై బహిరంగ చర్చకు సిద్ధం: హరీష్ రావు
తెలంగాణ ప్రజలతోపాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందన్నారు. కేంద్రాన్ని, పార్లమెంటును తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. మూసీపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని.. ఎక్కడకు రావాలో రేవంత్‌రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. మూసీపై అఖిలపక్షాన్ని చర్చలకు పిలుస్తానన్న సీఎం తోక ముడిచారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. సీఎంపై పార్లమెంట్‌లో హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతామని, మూసీపై బాధితుల పక్షాన శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో మరింత మెరుగ్గా 2014లో భూసేకరణ చట్టం తెచ్చామని, అదే రాష్ట్రంలో అమల్లో ఉందని చెప్పారు. దానిప్రకారం ఎన్యుమరేషన్ జరగలేదని, పీడీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, డీపీఆర్ సిద్ధం చేయలేదని, లబ్ధిదారులను గుర్తించలేదని హరీశ్ ఆరోపించారు. రంగనాయకసాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు ఆక్రమించానంటూ తనపై సీఎం నిరాధార ఆరోపణలు చేయడం తగదని హరీశ్ అన్నారు. ఒక గుంట భూమిని కూడా తాను ఆక్రమించలేదని..నిబంధనలకు లోబడి భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. భూఆక్రమణల చరిత్ర రేవంత్‌రెడ్డికే ఉందని, ఆక్రమణల్లో మునిగి తేలే ఆయనకు అందరూ దొంగల్లానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. తనపై ఆరోపణలు చేసిన సీఎం.. ఎప్పుడు వస్తారో చెబితే ఆ భూమి దగ్గరే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నేడు బీఆర్ఎస్ దివాస్
6,213 పాఠశాలలు మూసేందుకు కుట్ర
ఏడాది పాలనలోనే రాష్ట్రంలో 6213 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తోందని హరీశ్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రతి చిన్న గ్రామానికి ప్రాథమిక, ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని నిలదీశారు. ఏడాది కాకముందే జీరో స్కూల్ పేరిట 1,899 బడులు, 10 మంది లోపు విద్యార్థులున్న 4,314 స్కూళ్లను మూసివేసే ప్రణాళికలో భాగంగానే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడ్డ పులి
ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 29 , 2024 | 10:55 AM