ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర..

ABN, Publish Date - Nov 22 , 2024 | 11:06 AM

‘దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర.. కేసీఆర్ తెలంగాణ లో సాధించిన నీలి విప్లవం’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 2016-17లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24 గుకు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనమని అన్నారు. తెలంగాణ చేపల పెంపకంలో ఉత్తమ ‘ఇన్ ల్యాండ్ స్టేట్’ గా అవార్డు కైవసం చేసుకోవడం కేసీఆర్ విజయమని వ్యా్ఖ్యానించారు.

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (BRS Working President) కేటీఆర్‌ (KTR) ప్రతి రోజూ సోషల్ మీడియా (Social Media) వేదికగా ఎక్స్‌ (X)లో పోస్టులు చేస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Ex CM KCR)పై ఆయన ట్వీట్ (Tweet) చేశారు. ‘దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర.. కేసీఆర్ తెలంగాణ లో సాధించిన నీలి విప్లవం’ (Blue revolution) అంటూ ఆయన పేర్కొన్నారు. 2016-17లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24కు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనమని అన్నారు. తెలంగాణ చేపల పెంపకంలో ఉత్తమ ‘ఇన్ ల్యాండ్ స్టేట్’ గా అవార్డు కైవసం చేసుకోవడం కేసీఆర్ విజయమని వ్యాఖ్యానించారు.


అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం..: కేటీఆర్‌

‘అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు.. అదానీలాంటి దగాకోరుకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో చెప్పాలని ‘ఎక్స్‌’లో డిమాండ్‌ చేశారు. ‘తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే కుయుక్తుల్లో మీ బడే భాయ్‌ వాటా.. మీ అదానీ భాయ్‌ వాటా.. మీ హైకమాండ్‌ వాటా ఎంత?’ అని పరోక్షంగా సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం, అరిష్టమని, అవి అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.


అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా..: కవిత

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి వార్తలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు గురువారం అదానీ అంశంపై స్పందించారు. అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా.. అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్‌ చేయడం ఈజీ, ఆధారాలున్నా అదానీని అరెస్ట్‌ చేయడం మాత్రం కష్టమా.. అని కవిత అడిగారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఏసీ సభ్యుల ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్‌

ఏపీలో పీఏసీ సభ్యులకు తొలిసారి ఎన్నిక..

అదానీ లంచాల యాత్ర.. ఇరుక్కున్న జగన్

అదానీపై కేసు.. తాడేపల్లి ప్యాలెస్‌కు సెగ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 22 , 2024 | 11:16 AM