Praveen: గురుకులాలను శిథిలం చేయాలని రేవంత్ సర్కార్ కుట్ర
ABN, Publish Date - Sep 04 , 2024 | 03:31 PM
Telangana: రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలను శిథిలం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కుట్రలో సమిధలు అవుతున్నది ఎస్సీలని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో 2000 మంది ఉపాధ్యాయులను రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం గురుకులాలను శిథిలం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కుట్రలో సమిధలు అవుతున్నది ఎస్సీలని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో 2000 మంది ఉపాధ్యాయులను రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. రాజ్యాంగ, చట్టబద్ధంగా నిబంధనలకు లోబడి నియామకాలు జరిగిన వారిని తొలగించారని మండిపడ్డారు.
Seethakka: లక్ష చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క విస్మయం
2000 మంది నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టారంటూ విరుచుకుపడ్డారు. రెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గతంలో ఇంజనీర్లు, డాక్టర్లు అయితే... ఇపుడు మళ్లీ పశువులు కాసే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. వెయ్యి మంది డాక్టర్లను చేసిన గౌలిదొడ్డి గురుకులంలో ఉపాధ్యాయులు సమ్మె చేసే పరిస్థితి వచ్చిందన్నారు. పేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలు మూత పడ్డాయన్నారు.
CM Chandrababu: బుడమేరుకు మళ్లీ వరద.. లోకేష్‌కు చంద్రబాబు కీలక ఆదేశాలు..
హ్యాండ్ బాల్ క్రీడాకారుడు తిరుపతికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వకపోతే... కేటీఆర్ తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. రుక్మాపూర్ గురుకుల సైనిక పాఠశాల, భువనగిరి సైనిక కళాశాల నుంచి సైనిక అధికారులు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. మ్యూజిక్, ఒకేషనల్ కళాశాలల నుంచి సిబ్బందిని తొలగించారని మండిపడ్డారు. పేద విద్యార్థులు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. అన్ని వర్గాల వారు మేల్కొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Vemula Veeresham: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 04 , 2024 | 04:08 PM