ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి

ABN, Publish Date - Oct 28 , 2024 | 01:11 PM

Telangana: పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్‌ఎస్‌కు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ మీటింగ్‌కు గులాబి నేతలు బాయ్‌కాట్ చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

BRS Leaders

హైదరాబాద్, అక్టోబర్ 28: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్‌ను బీఆర్‌ఎస్ బాయ్ కాట్ చేసింది. అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్‌ను నియమించారని బీఆర్ఎస్ ఆరోపించింది. పీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో గులాబీ నేతలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని పీఏసీ చైర్మన్‌గా కేసీఆర్ నియమించారని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Former Minister Vemula Prashanth Reddy) తెలిపారు. క్రిష్ణారెడ్డి, గీతారెడ్డిని పీఏసీ చైర్మన్లుగా చేశామన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కే సీ.వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారని తెలిపారు. అయితే కేసీఆర్ సూచించిన హరీష్ రావు నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు.

TG Highcourt: హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ పాకాల


ఇప్పటికైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ చైర్మన్‌‌ను చేయాలని డిమాండ్ చేశారు. అరికేపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారన్నారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ చెప్పిందని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారన్నారు. ఆస్తులు కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారన్నారు. పీఏసీ ఛైర్మన్ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలన్నారు. కేసీఆర్ సూచించిన వారిని పీఏసీ చైర్మన్‌గా నియమించాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


అసెంబ్లీ సంప్రదాయాలకు తూట్లు: సత్యవతి రాథోడ్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బుల్డోజర్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా అక్రమంగా నియమించారన్నారు. పీఏసీ చైర్మన్‌గా ఎవరు ఉండాలో నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్‌కు ఉందని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ ఇచ్చారని.. అరికెపూడి గాంధీ, పట్నం మహేందర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాంప్రదాయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలే అంటున్నారని మాజీ మంత్రి తెలిపారు.


ఆయనకు ఎలా ఇస్తారు: ఎల్. రమణ

ప్రజాస్వామ్య సూత్రాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ ఎల్.రమణ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో పీఏసీ చైర్మన్ పదవి కీలకంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం చేసిన ఖర్చులపై పీఏసీలో చర్చ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికేపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇచ్చారని.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఎట్లా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారని ఎమ్మెల్సీ రమణ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

KTR: నీ సావు తెలివితేటలతో.. బంగారు తెలంగాణ బక్కచిక్కిపోతోంది

Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 28 , 2024 | 01:22 PM