Kadiyam Srihari: కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలన?
ABN, Publish Date - Feb 14 , 2024 | 02:42 PM
Telangana: అసెంబ్లీలో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: అసెంబ్లీలో సీఎం రేవంత్ (CM Revanth Reddy) అనుచిత భాషను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (BRS MLA Kadiyam Srihari) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తొలగించాలని తాము కోరుదామంటే స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలమని కానీ.. పార్లమెంటరీ సంప్రదాయాల మీద తమకు గౌరవం ఉందన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై (BRS Chief KCR) సీఎం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదన్నారు. బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారన్నారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలన అంటూ కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 14 , 2024 | 02:42 PM