ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సీఎం ఉండాల్సింది ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీలో

ABN, Publish Date - Aug 23 , 2024 | 03:02 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ఢిల్లీ యాత్రపై మండిపడ్డారు. రుణమాఫీ అవ్వక రైతులు అల్లాడుతుంటూ ఢిల్లీ యాత్రలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌కు దమ్ముంటే చల్లో పల్లెకు రావాలంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది ఢిల్లీలో కాదని.. తెలంగాణ గల్లిలో అంటూ వ్యాఖ్యలు చేశారు.

BRS Working President KTR

హైదరాబాద్, ఆగస్టు 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Working President KTR) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ఢిల్లీ యాత్రపై మండిపడ్డారు. రుణమాఫీ అవ్వక రైతులు అల్లాడుతుంటూ ఢిల్లీ యాత్రలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌కు దమ్ముంటే చల్లో పల్లెకు రావాలంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది ఢిల్లీలో కాదని.. తెలంగాణ గల్లిలో అంటూ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికపై ముఖ్యమంత్రిపై కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.

CM Ramesh: పరవాడ ఫార్మా సెజ్‌లో ఘటన దురదృష్టకరం


కేటీఆర్ ట్వీట్...

‘‘సీఎం రేవంత్ కు దమ్ముంటే... చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలి.. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..?? ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో.. ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..?? రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..?? ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారు.. గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు.. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..?? అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు..?? అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప.. అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..?? రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. ‘‘గుండుసున్నా’’ ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం.. జై కిసాన్ జై తెలంగాణ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Venkaiah: టంగుటూరు ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకం

Rain: ఈ వర్షాన్ని చూస్తే.. ‘వాహ్ క్యా రేన్ హే’ అనకుండా ఉండరు మరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 23 , 2024 | 03:05 PM

Advertising
Advertising
<