MLC Kavitha: ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..
ABN , Publish Date - Dec 23 , 2024 | 10:57 AM
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి రైతుల భూములు వేలం వేయడాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు.. వాటిని చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందంటూ కవిత మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ మాట గెలిచిన తర్వాత మరో మాట చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వేలం వేస్తోందంటూ ఆమె ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కవిత విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి రైతుల భూములు వేలం వేయడాన్ని కవిత ఖండించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు.. వాటిని చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వారి భూములు అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందంటూ కవిత మండిపడ్డారు.
ఈ ప్రయత్నాలను తాను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండా రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు అప్పు చెల్లించాలంటూ వేధించడం న్యాయమేనా అంటూ ఆమె ప్రశ్నించారు. రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నమ్మక ద్రోహానికి ఇదే నిదర్శనమంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు నేరాల అడ్డాగా హైదరాబాద్ తయారైందని, 2023తో పోలిస్తే 2024లో 41 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది 25,488 కేసులు నమోదైతే ఈ ఏడాది 35,944 కేసులు నమోదయ్యాయని తెలిపింది. నగరంలో దాడులు, హత్యోదంతాలు, ప్రాపర్టీ ఘటనలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన 2024-వార్షిక నివేదికను కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారని, ఈ విషయాలన్ని ఆ నివేదికలో ఉన్నట్లు ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ హయాంతో పోలిస్తే ప్రస్తుతం నేరాల పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. కీలక మలుపు తిరిగిన కేసు..
Chelpaka Encounter: అన్నంలో విషం పెట్టి చంపారు