ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కవిత జైలులో ఇబ్బంది పడుతోంది.. కేటీఆర్ ఆవేదన

ABN, Publish Date - Aug 09 , 2024 | 02:04 PM

Telangana: హైదరాబాద్, ఆగస్టు 9: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న చెల్లెలు కవిత గురించి అన్న కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్‌ నేతలు తీహార్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ...

BRS Working President KTR

హైదరాబాద్, ఆగస్టు 9: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న తన చెల్లెలు కవిత MLC Kavitha) గురించి కేటీఆర్ (BRS Working President KTR) ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్‌ నేతలు తీహార్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు 11 కిలోలు తగ్గారని, బీపీ వచ్చిందని పేర్కొన్నారు. దాని వల్ల రోజూ రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందన్నారు.

YSRCP: వైసీపీకి భారీ షాక్.. నాని రాజీనామా


ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ అంశంపై ఆలోచించి మాట్లాడాలన్నారు. దేశంలో పొలిటికల్‌గా కోట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవని చెప్పుకొచ్చారు. బెయిల్ కోసం నిన్న అప్పీల్ చేశామని, వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Manish Sisodiya: మనీష్ సిసోడియాకు భారీ ఊరట..


జైల్లో ఖైదీలు 11 వేలు ఉండాల్సిన చోట 30 వేలు మంది ఉన్నారన్నారు. జైలు పరిశుభ్రంగా లేదన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు భవిష్యత్‌లో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ టూర్ వివరాలు.. వెళ్తే తప్పక ఇవి చూడండి..

TG DGP: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ స్పందన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 09 , 2024 | 02:26 PM

Advertising
Advertising
<