ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించాం

ABN, Publish Date - Jul 20 , 2024 | 02:13 PM

Telangana: రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం గవర్నర్ రాధ కృష్ణన్‌ను కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఆయన ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతపై సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారన్నారు.

KTR Anger With CM Revanth Reddy

హైదరాబాద్, జూలై 20: రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. శనివారం గవర్నర్ రాధ కృష్ణన్‌ను కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఆయన ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసులు పెడుతున్నారన్నారు. మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.

Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!



వీటన్నింటినీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని.. దీనిపై గవర్నర్ స్పందించారన్నారు. హోమ్ సెక్రటరీని పిలిచి మాట్లాడతా అని అన్నారన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతుందని విమర్శించారు. పది మంది తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మేల్యే తమ టికెట్‌పై గెలిచి ఎంపీగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారన్నారు. దీన్ని గవర్నర్‌కు వివరించామన్నారు.


ప్రోటోకాల్ సమస్యలను వివరించామని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని రాజ్యాంగ సంస్థలను కలుస్తామని తెలిపారు. రాష్ట్రపతిని కలిసి వివరిస్తామన్నారు. రాజ్యాంగం చేతిలో పట్టుకుని ఫోజులు కొడుతున్నారని... అదే రాజ్యాంగాన్ని హననం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే దాకా పొరాడతామన్నారు. త్వరలోనే మేడిగడ్డ సందర్శిస్తామని.. వరదను తట్టుకుని ఎలా నిలబడ్డదో ప్రపంచానికి చూపిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

CM Revanth Reddy: పదిమందికి అన్నం పెడతారు.. నన్ను ఆదరించారు..



కేసీఆర్‌కు శుభాకాంక్షలు: గవర్నర్

గవర్నర్‌‌ను కలిసిన కేటీఆర్... బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆయనకు పరిచయం చేశారు. యాదగిరి గుట్ట నిర్మాణాన్ని ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు. ‘‘ఇటీవల యాదాద్రిని సందర్శించాను. ఆగమ శాస్త్రం ప్రకారం అద్భుతంగా నిర్మించారు.కేసీఆర్‌కు నా శుభాకాంక్షలు చెప్పండి’’ అని అన్నారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యంపై గవర్నర్ ఆరా తీశారు.


ఇవి కూడా చదవండి...

Andhra Pradesh: ఏజెంట్ చేతిలో మోసపోయిన ఏపీ వాసి.. స్వదేశానికి తీసుకొస్తానంటూ హామీ..

CM Revanth: ఆ ప్రక్రియను డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 02:21 PM

Advertising
Advertising
<