ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు

ABN, Publish Date - Sep 27 , 2024 | 09:49 AM

Telangana: హైడ్రా కూల్చివేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హైడ్రా టార్గెట్‌గా మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు.

BRS working President KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా (HYDRA) దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అనేక మందికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మూసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నేసింది. గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్.. మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది.

Ponguleti: నవంబరు నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు!


ఈ క్రమంలో 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. అయితే హైడ్రా కూల్చివేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ (BRS Working President KTR) స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హైడ్రా టార్గెట్‌గా మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే అంటూ పేర్కొన్నారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

‘‘మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు.. మాది నిర్మాణం - మీది విధ్వంసం.. లక్షల నిర్మాణాలు మావి - లక్షల కూల్చివేతలు మీవి. మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే. కట్టలేదన్నారు - ప్రజలను మభ్యపెట్టాం అన్నారు - మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయి చిట్టి.. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా.. కేసీఆర్ నిజం, అయన హామీలు నిజం ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా. మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు ఇవ్వాళా కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయి. కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం - కేటాయింపులు నిజం. మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


జీహెచ్‌ఎంసీ అప్రమత్తం...

మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. వేర్వేరు కారణాల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏడాదిన్నరగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పనుల పునఃప్రారంభంపై కసరత్తు మొదలుపెట్టింది. ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉంది.? పనులు పూర్తి చేయడానికి ఎంత డబ్బు కావాలి ? ఇప్పటికే పూర్తయిన ఇళ్లెన్ని ? కేటాయించినవి ఎన్ని ? తదితర వివరాలతో ప్రభుత్వానికి ఓ నివేదిక పంపింది. దాని ప్రకారం వివిధ దశల్లో నిలిచిన 25వేలకు పైగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.3000 కోట్లు అవసరమని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లు 4500 ఉన్నాయి. మూసీ నిర్వాసితులకు 15వేల ఇళ్లు అవసరమున్న దృష్ట్యా మరో 10 వేల ఇళ్లు సిద్ధం చెయ్యాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుది దశకు చేరుకున్న ఇళ్ల నిర్మాణ పనులు తొలుత పూర్తి చేయాలని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్యే కొలికపూడిపై అధిష్ఠానం ఆరా

IPL 2025: ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల సంఖ్యపై కీలక అప్‌డేట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 12:12 PM