ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: సంచలనం.. రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు..

ABN, Publish Date - Nov 13 , 2024 | 09:54 PM

Telangana: కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం ఘర్షణల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును..

BRS Working President KTR

Telangana: కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం ఘర్షణల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు.. మరికొందరి ఆదేశాలు కూడా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు.


పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా ప్రజలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. అంతేకాదు.. కొందరికి డబ్బులు ఇచ్చి మరీ దాడికి ఉసిగొల్పారన్నారు. అధికారులను చంపినా పర్వాలేదని.. రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచరించామని పోలీసులు తెలిపారు. నిందితుడు విశాల్‌‌తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందన్నారు.


లగచర్ల ఘర్షణలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది కీలక పాత్రగా తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడు బోగమోని సురేష్‌ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్‌వాష్‌ చేయించారన్నారు. నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించారని చెప్పారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని మళ్లించారన్నారు. భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు. అన్ని రకాల మద్దతు ఉంటుందని, తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు, నిందితుడు సురేష్‌‌కు నరేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.


లగచర్ల మొత్తం వ్యవహారానికి పట్నం నరేందర్ రెడ్డి సూత్రదారి అని.. ఆయనే ఈ కుట్రను రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారన్నారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం 07:02 గంటలకు హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. విచారణలో నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించారని పోలీసులు తెలిపారు. అలాగే తమ పార్టీ ప్రముఖ నాయకుడు కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి చెప్పాడన్నారు. రాజకీయ ప్రయోజనం పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సురేష్‌ను ఫోన్‌లో తరచుగా సంప్రదించి వారి చర్యలను అంచనా వేసినట్లు కూడా ఒప్పుకున్నాడన్నారు. నిందితుడు బి సురేష్ సీడీఆర్ డేటాలో కూడా ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.


Also Read:

ఎంజాయ్ మీది.. డబ్బులు ప్రభుత్వానివి.. బంపర్ ఆఫర్..!

సామాన్యులకు షాకింగ్.. త్వరలో పెరగనున్న వీటి ధరలు

చిల్డ్రన్స్ డే స్పెషల్.. మీ పిల్లలను ఇలా సర్ ప్రైజ్ చేయండి..

For More Telangana News and Telugu News..

Updated Date - Nov 13 , 2024 | 09:54 PM