KTR: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కేటీఆర్ ఆందోళన
ABN, Publish Date - Aug 01 , 2024 | 04:53 PM
Telangana: రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ (BRS Working President KTR) ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt), పోలీసులు (TS Police)పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటన్నారు.
ఈ క్రూరమైన చర్యలు మహిళలకు తీవ్రమైన భద్రత లేకపోవడం, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ఎత్తి చూపుతున్నాయన్నారు. ఎనిమిది నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, నేరాలు పెరగడం ప్రత్యక్ష ఫలితమే అని చెప్పుకొచ్చారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్వర న్యాయం, దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
CM Revanth: కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్
కదులుతున్న బస్సులో దారుణం...
కాగా... రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కదులుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై ఆ వాహన డ్రైవర్లలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 29న హరిక్రిష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా పామూరుకు బయలుదేరింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సిద్ధయ్య, కృష్ణ (40) ఉన్నారు. నిర్మల్ నుంచి వాహనాన్ని సిద్ధయ్య నడిపాడు. అక్కడ తొమ్మిదేళ్ల కూతురుతో కలిసి 27 ఏళ్ల మహిళ బస్సెక్కింది. అప్పుడే ఆమెపై అదనపు డ్రైవర్ కృష్ణ కన్నేశాడు. ఆమె తనకు మాత్రమే టికెట్ తీసుకోవడం, కూతురుకు తీసుకోకపోవడాన్ని గమనించి మాటల్లో పెట్టాడు. మధ్య సీట్లలో కాకుండా బస్సు చివరి సీట్లోకి వెళ్లి కూర్చుంటే పాపను పడుకోబెట్టడానికి ఇబ్బంది ఉండదంటూ సలహా ఇచ్చాడు. అతడు చెప్పినట్లే పాపతో కలిసి ఆమె చివరి సీట్లోకి వెళ్లి పడుకుంది. అర్ధరాత్రి 12:15 గంటలకు బస్సు హైదరాబాద్ సమీపంలోకి చేరుకుంది. బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అదనపు డ్రైవర్ కృష్ణ, వెనుక సీట్లోకి వెళ్లాడు. అక్కడ బాలికతో కలిసి నిద్రస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. నిద్రలోంచి లేచిన ఆమె.. షాక్‌లోంచి తేరుకునేలోపే నోట్లో బెడ్‌షీట్‌ను కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. తన పట్ల జరిగిన ఘోరాన్ని తోటి ప్రయాణికులతో చెప్పుకొని, వారి సాయంతో డయల్-100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సును ఛేజ్ చేసి తార్నాక మెట్రో స్టేషన్ వద్ద పట్టుకున్నారు. అప్పటికే నిందితుడు కృష్ణ మెట్టుగూడ చౌరాస్తాలో బస్సులో నుంచి దూకి పారిపోయాడని ప్రయాణికులు చెప్పారు. బస్సును సీజ్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సాఫ్ట్‌వేర్ యువతిపై..
సాఫ్ట్‌వేర్ యువతిపై సామూహిక అత్యాచారం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం జరిగింది. అమ్మాయికి జాబు వచ్చిందని ట్రీట్ ఇవ్వమని స్నేహితుడు గౌతమ్ రెడ్డి అడిగాడు. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డి, మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు, గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కి వచ్చారు. అక్కడే బార్‌లో ఇద్దరూ మద్యం సేవించి హోటల్‌లో ఉన్న రూమ్‌కి వెళ్లారు. అప్పటికే బాధితురాలు మత్తులో ఉండటంతో స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి రూమ్‌లో ఉండగా బాధితురాలు కేకలు వేసింది. హోటల్ సిబ్బంది రూమ్‌కు వెళ్లడంతో రూమ్‌లో ఉన్న ఇద్దరు పరారయ్యారు. బాధితురాలు రక్తం మడుగులో ఉండడంతో వారు ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతిపై గౌతమ్ రెడ్డి.. తన మిత్రుడితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
TS News: ఇద్దరు మహిళలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్ట్
KTR: నిండుసభలో మహిళల పట్ల వారి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం...
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 01 , 2024 | 04:58 PM