ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drugs: డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:25 AM

Telangana: థియేటర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న బీటెక్ విద్యార్థిని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో థియేటర్ వద్దకు వెళ్లి పోలీసులు తనిఖీ చేయగా అనుమానస్పదంగా ఉన్న బీటెక్‌ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7 గ్రాముల ఎండీఎమ్‌ఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

BTech student caught selling drugs

హైదరాబాద్, అక్టోబర్ 29: భాగ్యనగరాన్ని డ్రగ్స్ (Drugs) మహమ్మారి వీడటం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో యువత చెడు మార్గాలను ఎంచుకుంటోంది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాల్సిన కొంతమంది యువత చెడుమార్గాలను ఎంచుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ పట్టుబడి మూడు రోజులు కూడా గడువకముందే మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. పక్కా సమాచారంతో థియేటర్ వద్ద డ్రగ్స్‌ను పట్టుకున్నారు పోలీసులు. అయితే డ్రగ్స్‌ను విక్రయిస్తూ పట్టుబడింది మాత్రం బీటెక్ విద్యార్థి. ఇంతకీ డ్రగ్స్ ఎక్కడ పట్టుబడింది.. డ్రగ్స్ విక్రయిస్తున్న విద్యార్థి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Fire Accident: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి


హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వెళ్లింది. పక్కా సమాచారంతో థియేటర్‌కు వద్దకు వెళ్లిన హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు.. తనిఖీ చేయగా డ్రగ్స్ విక్రయిస్తూ బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న జాన్ నుంచి 7 గ్రాముల ఎండీఎమ్‌ఏ డ్రగ్స్‌ను గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు విద్యార్థి సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రాము డ్రగ్‌ను రూ. 2500కు తీసుకొచ్చి రూ.5000 చొప్పున అమ్మకాలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు నెల్లూరు జిల్లా వాసిగా గుర్తించారు. విద్యార్థి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

హే రఘురాం


కాగా.. ఇటీవల హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. లోకల్ పోలీసులతో కలిసి హెచ్ న్యూ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్‌తో పాటు అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుమయూన్‌నగర్, హెచ్ న్యూ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. విదేశీ డ్రగ్ పెడ్లర్ నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంచన్‌బాగ్‌ పోలీసులకు మరో అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్ చిక్కాడు. అతని వద్ద నుంచి 80 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 25 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

వాళ్లందరినీ ముక్కలుగా నరికేస్తాం: మిథున్‌

Harish Rao: ఇదీ.. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన ‘మార్పు’

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2024 | 11:29 AM