Telangana Assembly: ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ABN, Publish Date - Jul 11 , 2024 | 04:44 PM
Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై ఈరోజు (గురువారం) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీలో రివ్యూ నిర్వహించారు.
హైదరాబాద్, జూలై 11: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు (Telangana Assembly Budget Session) సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై ఈరోజు (గురువారం) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Assembly Speaker Gaddem Prasad Kumar, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Council Chairman Gutta Sukhender Reddy) అసెంబ్లీలో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌లు రామచంద్రనాయక్, ఆది శ్రీనివాస్, సీఏస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా
అయితే అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈసమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే రైతు భరోసా పథకంపై చర్చతో పాటు, జాబ్ కాలెండర్‌ను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
KTR: ‘ఈమహా నగరానికి ఏమైంది?’.. కేటీఆర్ షాకింగ్ ట్వీట్
Mothkupalli: పవన్ ఫోటోలు పెట్టినట్టే భట్టి ఫోటోలు కూడా పెట్టాల్సిందే...
Reader Latest Telangana News And Telugu News
Updated Date - Jul 11 , 2024 | 04:57 PM