ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam kuamr: మరమ్మతులు, పునరుద్ధరణకు టెండర్లను పిలవండి.. మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

ABN, Publish Date - Sep 05 , 2024 | 04:45 PM

Telangana: భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంభవించిన వర్షపు ఉధృతికి జరిగిన నష్టంపై గురువారం నాడు నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 5: భారీ వర్షాలకు (Heavy Rains) తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంభవించిన వర్షపు ఉధృతికి జరిగిన నష్టంపై గురువారం నాడు నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..


ఈ సందర్భంగా చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. వెంటనే పాలనాపరమైన అనుమతులు తీసుకుని శుక్రవారం ఉదయానికి ఆన్‌లైన్‌లో టెండర్లు అప్‌డేట్ చెయ్యాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇంతటి వర్షపు ఉధృతిలోనూ విధుల్లో నిమగ్నమయి పనిచేసిన నీటిపారుదల శాఖా సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే అదే సమయంలో తాను స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చుశాయన్నారు.

AP News: జోగి ఎక్కడ? హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..!


రెగ్యులేటరీలు, షట్టర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న పరిశీలన కనిపించలేదన్నారు. తద్వారా విపత్తులు సంభవించినప్పుడు దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఒక దగ్గర రెగ్యులేటరీ జామ్ అయ్యిందన్నారు. మరోచోట షట్లర్ ఎత్తుతుంటే తెగిపోయిందన్నారు. ఈ తరహా సంఘటనలు మరోసారి పునరావృతం అయితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే అందుకు సీఈలే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరేరాం, శంకర్.. నీటిపారుదల శాఖా సలహాదారుడు అదిత్యా దాస్ నాధ్, డిప్యూటీ ఈఎన్‌సీ కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖా చీఫ్ ఇంజినీర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

Ranganath: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 04:48 PM

Advertising
Advertising