Congress: గాంధీభవన్‌లో కులగణన సమావేశం.. నేతలు ఏంచెప్పారంటే
ABN, Publish Date - Oct 30 , 2024 | 02:56 PM
Telangana: సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి చేయూత ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో కులగణన సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన అమలు చేస్తోందని భట్టి వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబర్ 30: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) చేస్తున్న కులగణనపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Cm Bhatti Vikramarka) వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన బుధవారం కులగణన సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి చేయూత ఇచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు.
Jethwani Case: సీఐడీ విచారణ ప్రారంభం
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన అమలు చేస్తోందన్నారు. కులగణనతో వెనకబడిన వర్గాలకు ఏం చేయవచ్చనే అంశంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాలలో త్వరలోనే డీసీసీ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలకు అతీతంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెల 5న రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని.. రాహుల్ గాంధీతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశం మొత్తానికి తెలంగాణ కులగణన ఎక్స్ రేలా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
కులగణనకు సహకరించండి: పొన్నం
దేశంలో తొలిసారి సమగ్ర కుల సర్వే జరిపేందుకు అన్ని ఏర్పాటు సిద్ధమయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 6 నుంచి కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని శాసనసభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. సర్వేకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేలో పాల్గొని అధికారులకు సహకరించాలని చెప్పారు. అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.
లేదంటే మీ పార్టీ కనుమరుగే: కోమటిరెడ్డి
కులగణన చేయాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేసిన విమర్శలు చేయడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందన్నారు. 50 శాతం పై బడిన బీసీ వర్గాలకు మేలు జరుగబోతోందన్నారు. ‘‘దీపావళికి దావత్ చేసుకుంటే తప్పేంది అంటున్నాడు. మీరు అప్పులు చేస్తే మేము వడ్డీలు కడుతున్నాం. చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. డీఎస్సీ నిర్వహించాం. వెనుకబడిన కులాల మీద వాళ్లకు ప్రేమ లేదు. ఫ్లోర్ లీడర్ నువ్వే ఉంటావ్. మా పీసీసీ చీఫ్ బలహీన వర్గాల నేత. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనండి సహకరించండి. కేసీఆర్ ఫాం హౌస్ నుంచి ప్రెస్‌నోట్ అయినా విడుదల చేయాలి. లేదంటే మీ పార్టీ కనుమరుగవుతుంది’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Raghunandan: కాంగ్రెస్ సర్కార్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్
Read Latet Telangana News And Telugu News
Updated Date - Oct 30 , 2024 | 03:28 PM