ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: ప్రధాని మోదీ సీఎం రేవంత్ భేటీ... చర్చించే అంశాలివే!

ABN, Publish Date - Jul 04 , 2024 | 09:59 AM

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న (బుధవారం) ఢిల్లీకి చేరుకున్న సీఎం... మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈరోజు(గురువారం) కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో రేవంత్ భేటీకానున్నారు.

CM Revanth Reddy

న్యూఢిల్లీ, జూలై 4: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో (Delhi) బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న (బుధవారం) ఢిల్లీకి చేరుకున్న సీఎం... మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈరోజు(గురువారం) కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ (PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో (Central Home Minister Amit Shah) రేవంత్ భేటీకానున్నారు. నేటి ఉదయం 11:30 గంటలకు అమిత్ షాతో, మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం అవనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), అధికారులు కూడా ప్రధాని, కేంద్ర హోంమంత్రితో జరిగే సమావేశంలో పాల్గొన్నానున్నారు. రాష్ట్రానికి పలు కీలక అంశాలను ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లనున్నారు.

Chandrababu: చంద్రబాబు, జగన్‌ల షెడ్యూల్‌పై ఏపీలో ఇంట్రస్టింగ్ చర్చ


ఏపీ సీఎం చంద్రబాబు కూడా...

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కూడా ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో, హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని, హోం మంత్రితో ఏపీ ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఉదయం 10.15కు ప్రధానితో ఏపీ సీఎం సమావేశం కానున్నారు.

Indian Army: అవన్నీ అబద్ధాలు.. అగ్నివీర్ కుటుంబాల పరిహారంపై ఆర్మీ వివరణ


కాగా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విడివిడిగా ప్రధాని, హోంమంత్రితో భేటీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లో (Hyderabad) ఇద్దరు సీఎంల సమావేశం జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి విడివిడి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీ పునర్ నిర్మాణం, కేంద్రం మద్దతు సహకారం ఎజెండాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సాగుతోంది.


ఇవి కూడా చదవండి...

YSRCP: ప్లీజ్.. ప్లీజ్ టీడీపీలోకి వచ్చేస్తాం.. వెంటపడుతున్న వైసీపీ నేతలు!

Hyderabad: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు..

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 04 , 2024 | 10:34 AM

Advertising
Advertising