ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అలెర్ట్.. ప్రజలకు విజ్ఞప్తి, అధికారులకు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:35 AM

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆదివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు..

హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆదివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యవసర టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మరోవైపు.. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రేవంత్ ఆదేశాలు జారీచేశారు.


సెలవుల్లేవ్..!

అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని.. ఒకవేళ సెలవులు పెట్టిన వారుంటే వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా.. వరద ఎఫెక్ట్ ఉన్న ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు బయటికి రావొద్దని ప్రజలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా.. అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. మరోవైపు.. 24 గంటలు అలెర్ట్‌గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


ఎటు చూసినా వర్షమే!

తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది.. శనివారం పొద్దున మొదలైన వర్షం ఆదివారం మధ్యాహ్నం కావస్తున్నా ఆగలేదు! బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల జల్లులుగా.. ఇంకొన్ని చోట్ల భారీగా.. మరికొన్ని చోట్ల అతిభారీగా వర్షం పడింది! రాజధాని హైదరాబాద్‌ సహా పలుచోట్ల జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద పోటెత్తింది. పల్లెల్లో వరి పొలాలు, పత్తి, మొక్కజొన్న, కంది చేలు నీటమునిగాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే నిండిన చెరువులు, కుంటలు అలుగు పోస్తుంటే.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా చాలాచోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా పాత ఇళ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ఒకరు గాయపడ్డారు. మరొకరు వరద నీటిలో గల్లంతయ్యారు!

Updated Date - Sep 01 , 2024 | 11:53 AM

Advertising
Advertising