CM Revanth: మూసీ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ కసరత్తు
ABN , Publish Date - Nov 01 , 2024 | 11:30 AM
Telangana: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు అభివృద్ది చేయనున్నారు. బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
హైదరాబాద్, నవంబర్ 1: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులతో సీఎం వరుసగా సమీక్షలు జరుపుతున్నారు. మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు గోదావరి జలాల తరలింపు కోసం ట్రంక్ లైన్ నిర్మాణంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ట్రంక్ లైన్ నిర్మాణం కోసం ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం టెండర్లు పిలువనుంది. మరో పది రోజుల్లో ఎస్‌టీపీల కోసం టెండర్లు వేయనున్నారు. మొదటి విడతలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు అభివృద్ది చేయనున్నారు. బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు డిజైన్, అభివృద్ది పనులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Harirama jogaiah: మరో లేఖతో ముందుకొచ్చిన హరిరామజోగయ్య
కాగా.. మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు. అంటే దీని పరిధిలో ప్రస్తుతం నదీగర్భం.. మూసీకి అటూ ఇటూ ఉన్న ప్రాంతం (కట్టలు) మాత్రమే వస్తాయి. రెండో దశలో మూసీ నదికి అటూ ఇటూ 50 మీటర్ల పరిధిలోని బఫర్‌జోన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అయితే డీపీఆర్‌ను మాత్రం ఒకే ప్రాజెక్టు కింద రూపొందిస్తారు. పనులు నిరంతరాయంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగేందుకే ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తిచేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండోదశకు అవసరమైన కార్యాచరణ మొదలు పెడతారని సమాచారం.
Rohit Sharma: టాప్-3 రిటెయిన్ ప్లేయర్స్‌లో తన పేరు లేకపోవడంపై రోహిత్ శర్మ
ఇప్పటికే మూసీ నది గర్భంలో ప్రభుత్వం గుర్తించిన దాని ప్రకారం 1600 ఇళ్లు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలామందిని ఇప్పటికే ఖాళీ చేయించి అక్కడి నుంచి తరలించారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోయే బాధితులకు డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే కొందరికి ఇళ్లు కేటాయించగా వారు అక్కడికి వెళ్లారు. అయితే ఇళ్లు కోల్పోనున్నవారు పెద్ద సంఖ్యలో ఉండటంతో బాధిత కుటుంబాలకు రింగ్‌రోడ్డుకు దగ్గర్లో 150-200 గజాల వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం మూసీకి అటూ ఇటూ రిటెయినింగ్ వాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. వాల్ మధ్యలో ఉన్న మూసీ నదిని శుద్ధి చేసి.. అటూ ఇటూ కట్టలను సుందరీకరణ చేయాలని భావిస్తోంది. ఇక బఫర్‌జోన్‌లో మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల మేర రెండు వైపులా విశాలమైన రహదారిని నిర్మిస్తారు. అటూ ఇటూ రహదారుల ప్రక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.
ఇవి కూడా చదవండి..
Diwali 2024: దీపావళి అలంకరణ.. ఈ టిప్స్‌తో ఇంట్లో వెలుగులు రెట్టింపు
Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..
Read Latest Telangana News And Telugu News