CM Revanth: ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - May 12 , 2024 | 10:09 AM
Telangana: గత కొద్దిరోజులుగా లోక్‌సభ ఎన్నికలప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. నిన్నటితో ప్రచారానికి తెరపడింది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్‌గా ఉన్నారు.
హైదరాబాద్, మే 12: గత కొద్దిరోజులుగా లోక్‌సభ ఎన్నికల (Loksabha polls) ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజీబిజీగా ఉన్నారు. నిన్నటితో ప్రచారానికి తెరపడింది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం రేవంత్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్‌గా ఉన్నారు. నిత్యం ప్రజా పరిపాలన, పర్యటనలు, మీటింగ్‌లతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సీఎం సరదాగా ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు రేవంత్ ఫుట్‌బాల్ ఆడటం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీలో (Hyderabad Central University) విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ ఫుట్‌బాల్ ఆడారు. స్టూడెంట్స్‌తో కలిసి గోల్ వేసేందుకు మైదానంలో పరుగులు తీశారు. ఆట మధ్యలో షూ పాడవడంతో పక్కకు వెళ్లిపోకుండా.. షూస్ తీసేసి మరీ.. షూస్ లేకుండానే ఫుట్‌బాల్ ఆటలో మునిగితేలారు సీఎం రేవంత్.
AP Elections: ‘మేం చెప్పిన వారినే పోలింగ్‌కు తీసుకురండి’... వాలంటీర్లతో వైసీపీ
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , టీఎమ్‌ఆర్‌ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ, ఎస్‌యూఐ యూనిట్, హెచ్‌సీయూ విద్యార్థులు కూడా ఫుల్‌బాల్ ఆడారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏం ఏ ఫహీం, టీ శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి, ఇతరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ ఆడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ ఆడటం పట్ల నెటిజన్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
BRS: కేసీఆర్ నేటి దేవరకొండ పర్యటన రద్దు
TS News: అందమైన వాయిస్‌తో వలపు వల... కలుద్దామని పిలిచి నిలువు దోపిడి..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 12 , 2024 | 10:31 AM