CM Revanth: బీఆర్ఎస్ నేతలను సీఎం అంత మాటనేశారేంటి
ABN, Publish Date - Dec 21 , 2024 | 02:56 PM
Telangana: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. క్రూర మృగాలనైనా బంధించే శక్తి తమ సభ్యులకు ఉందన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు విధ్వంసకారులుగా తయారయ్యారంటూ విరుచుకుపడ్డారు. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా?.. మూసీపై నల్గొండ జిల్లా ప్రజలను అడుగుదాం అని సభలో ముఖ్యమంత్రి అన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చలో భాగంగా బీఆర్‌ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు దొంగలకు సంచులు మోసేవాళ్లే అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలా? వద్దా?.. ఆర్థిక ఉగ్రవాదులను ఇంకెంతకాలం భరించాలి అని అన్నారు. బీఆర్‌ఎస్‌లో వెనుక కూర్చున్న కొందరు నేతలు తనకు కావాల్సిన వాళ్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయకుండా నల్గొండకు ద్రోహం చేశారని.. బీఆర్‌ఎస్ నేతలు నల్గొండ జిల్లాకు వస్తారా అని ప్రశ్నించారు.
విధ్వంసకారుల్లా...
పదేళ్లు ప్రభుత్వం నడిపిన వారు ఎంత బాధ్యతగా ఉండాలి... అలాంటిది ఏడాది కాకుండానే తమపై విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూర మృగాలనైనా బంధించే శక్తి తమ సభ్యులకు ఉందన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు విధ్వంసకారులుగా తయారయ్యారంటూ విరుచుకుపడ్డారు. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా?.. మూసీపై నల్గొండ జిల్లా ప్రజలను అడుగుదాం అని సభలో ముఖ్యమంత్రి అన్నారు.
కూలేశ్వరం కట్టారు...
గత ప్రభుత్వం 11.5 శాతం వడ్డీతో అప్పులు తెచ్చిందని.. బీఆర్‌ఎస్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం వల్ల సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేయలేకపోతున్నామన్నారు. కొన్ని ముఖ్య ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ రెండు శాతం వడ్డీకే రుణాలు ఇస్తుందన్నారు. 11.5 శాతం వడ్డీకి అప్పు తెచ్చిన వారిని ఏం చేయాలని అడిగారు. ఇలాంటి తప్పు చేస్తే వేరే దేశంలో ఉరి వేసేవారని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. కేసీఆర్ పదేళ్లు కష్టపడి కూలేశ్వరం కట్టారని దుయ్యబట్టారు. గత పాలనలో పనులు చేయించుకుని బకాయిలు పెట్టారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు పెట్టారని.. ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిపోయారన్నారు. మొత్తం రూ.40,154 కోట్ల బకాయిలు అప్పగించారన్నారు. పదేళ్లు పాలించి విధ్వంసం సృష్టించారన్నారు. ‘‘నేను తండ్రి పేరు చెప్పుకుని ఇక్కడకి రాలేదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
CM Revanth Reddy: అబద్దాల సంఘం అధ్యక్షుడు ఎక్కడ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
అభివృద్ధిని అడ్డుకుంటారా...
కొడంగల్‌లో 1300 ఎకరాల భూసేకరణ చేస్తే రాద్ధాంతం చేశారని.. యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ నా ప్రాంత ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటారా’’ అంటూ మండిపడ్డారు. ‘‘మూసీ ప్రాజెక్టు వద్దంటారు.. పరిశ్రమలు వద్దంటారు. మెట్రో విస్తరణ వద్దంటారు.. మరి అభివృద్ధి ఎలా సాధ్యం. ఆర్‌ఆర్ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ చేపట్టాలా? వద్దా? అంటూ సభలో బీఆర్‌ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
మీ నీతులు అవసరం లేదు.. బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్
Hyderabad: టార్గెట్ న్యూ ఇయర్ వేడుకలు.. ముంబై నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్స్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 21 , 2024 | 02:56 PM