ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: బుద్ధుని సందేశం దేశానికి ఎంతో అవసరం

ABN, Publish Date - May 23 , 2024 | 03:24 PM

తెలంగాణలో బౌద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారన్నారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని ఉద్ఘాటించారు.

CM Revanth Reddy

హైదరాబాద్:  తెలంగాణలో బౌద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారన్నారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని ఉద్ఘాటించారు. సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో గురువారం మహబోధి బుద్ధవిహర్‌లో జరిగిన బుద్ధపూర్ణిమ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని తెలిపారు.


ప్రతి పనిని ధ్యానంగా  చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉందని ఈ సూక్తిలో నుంచి ఎంతో స్ఫూర్తిని పొందారని చెప్పారు. ఏ పని అయినా తాను ఎంతో ధ్యానంగా చేస్తానని స్పష్టం చేశారు. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ఒక పాఠశాలను నిర్వహించాలని తాను కోరుతున్నానని చెప్పారు.


సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయన్నారు. సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉందన్నారు. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమన్నారు. బుద్ధుడి సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం మీది... అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..

టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 23 , 2024 | 05:04 PM

Advertising
Advertising