ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమిపూజ..

ABN, Publish Date - Aug 28 , 2024 | 09:56 AM

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే భూమిపూజా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌లో సీఎం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 9, 2024న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.


అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అయితే ఆ స్థానంలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ మేరకు అక్కడ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎలా పెడతారంటూ మండిపడింది.


రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణతో ఉన్న సంబంధం ఏంటని, ఆయన విగ్రహం పెట్టాలని అవసరం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఏర్పాటుపై ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విగ్రహ ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:

MLC Kavitha: నేడు హైదరాబాద్‌కు కవిత..

Hyderabad: చంచల్‌గూడ జైలులో ఖైదీల నిరాహారదీక్ష

Updated Date - Aug 28 , 2024 | 10:57 AM

Advertising
Advertising
<