ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మోదీజీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించలేరు.. ప్రధానిపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..

ABN, Publish Date - Oct 06 , 2024 | 09:35 PM

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంటూ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంటూ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల ముందస్తు ప్రచారంలో భాగంగా రుణమాఫీపై ప్రధాని చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, ఆ విషయం మీరొచ్చి అడిగితే ఏ రైతు అయినా చెప్తారంటూ మోదీకి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి ఘాటు లేఖ రాశారు.


రేవంత్ రెడ్డి లేఖ ఇదే..

"ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ.. తెలంగాణలో రైతుల రుణమాఫీ గురించి మీరు ప్రస్తావించారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రుణమాఫీని విజయవంతంగా అమలు చేశాం. పథకం అమలు గురించిన వాస్తవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. వాగ్దానం చేసిన విధంగా రూ.2లక్షల రుణాన్ని పూర్తిగా మాఫీ చేశాం. మొత్తం 22,22,067 మంది రైతులకు, రూ.17,869.22 కోట్లు వారి ఖాతాల్లో వేశాం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇదే అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీ. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు పైమెుత్తాన్ని చెల్లించిన తర్వాత రుణమాఫీ అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ గ్యారెంటీ గోల్డెన్ గ్యారెంటీ అని అన్నదాతలు నమ్ముతున్నారు. వారి సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అంకితభావాన్ని మీరు శంకించలేరు. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ సర్కార్ ఆదర్శ నమూనాగా నిలుస్తోంది. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ఈ ప్రయత్నంలో ప్రధానిగా మీ పూర్తి సహకారం, మార్గదర్శకత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నా" అని పేర్కొన్నారు.


ప్రధాని వ్యాఖ్యలు ఇవే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. ఈనెల మూడో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున్న రోడ్ షోలు, బహిరంగ సభలతో దూకుడు పెంచాయి. ఈ సందర్భంగా శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం)- బీజేపీ- ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సంకీర్ణ కూటమి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ గత శనివారం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ కూటమిపై విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇస్తుందని, ఒకవేళ గెలిస్తే మాత్రం వాటిని విస్మరిస్తుందంటూ ఆరోపించారు. అందుకు ఉదాహరణే తెలంగాణలో రైతు రుణమాఫీ అంటూ ప్రస్తావించారు. ఎన్నికల వేళ రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఏడాది గడుస్తున్నప్పటికీ పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ అలానే చేస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

TG News: హైదరాబాద్‌లో ఘనంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాల కార్యక్రమం..

CM Revanth Reddy: మూసీ నిర్వాసితులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Etela Rajender: సీఎం రేవంత్‌కి ఎంపీ ఈటల ఘాటు లేఖ

Updated Date - Oct 06 , 2024 | 09:46 PM