Adi Srinivas: కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో..సుద్దపూస ముచ్చట్లు ఆపు
ABN, Publish Date - Sep 24 , 2024 | 03:55 PM
Telangana: ‘‘పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా. 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతవా. ఆ నాడు ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్న వెధవ ఎవరు?
హైదరాబాద్, సెప్టెంబర్ 24: పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Govt Whip Adi Srinivas) గట్టి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ. కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో అంటూ హితవుపలికాడు. ‘‘పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా. 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతవా’’ అంటూ మండిపడ్డారు.
CM Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. ఏంటంటే
ఆ వెధవన్నర వెధవ ఎవరు..
‘‘ఆ నాడు ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్న వెధవ ఎవరు? ఆ నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు? ఆ నాడు విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతి భవన్‌కు తీసుకుపోయిన వెధవన్నర వెధవ ఎవరు? రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనం అంటు పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరులు ఎవరు? పార్టీలకు పార్టీలను మింగేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అని నంగనాచి కబుర్లు చెపుతావా? పదేళ్ల పాటు నువ్వు, నీ అయ్య ప్రదర్శించిన అతి తెలివిని తెలంగాణ జనం చూశారు’’ అంటూ విరుచుకుపడ్డారు.
AP Govt: ఏపీ మహిళా కమిషన్‌ను వెంటనే తొలగించండి.. ప్రభుత్వం ఆదేశాలు
తెలంగాణలో నూకలు చెల్లే రోజులు దగ్గర్లోనే..
‘‘తెలంగాణలో సిగ్గు, లజ్జ, మర్యాద లేని బతుకులు కల్వకుంట్ల కుటుంబానివి. మీ ఫిరాయింపుల బాగోతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేటీఆర్ నీ సుద్దపూస ముచ్చట్లు ఆపు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై కేటీఆర్ పదే పదే ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రజలు ఛీ తక్కరించినా రోజు ఏదో ఒక వంకతో మీడియా కోసం సొల్లు వాగుడు వాగుతున్నవు? లోక్‌సభ ఎన్నికల్లో జీరో చేసినా నీకు, నీ అయ్య కు బుద్ధి రాలేదు. తెలంగాణలో నీకు నూకలు చెల్లే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మాకు ముఖ్యమంత్రిని ఆడిపోసుకోవడమే నీ దొంగల ముఠాకు పనిగా మారింది. ఎమ్మెల్యేలు మోసం చేశారని వేమన శతకాలు చదువుతున్నవా కేటీఆర్. పదేళ్లలో నువ్వు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చేయించింది ఏమిటి? నువ్వు చేస్తే సంసారం... పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఉప ఎన్నికలు వస్తాయని మాట్లాడుతున్నావు.. ఇప్పటికే వచ్చిన ఎన్నికల్లో నువ్వు చేసింది ఏమిటి? అసెంబ్లీలో ఓడించాం, పార్లమెంట్‌లో చిత్తు చిత్తు చేశాం.. కంటోన్మెంట్ బై ఎలక్షన్ నిన్ను అడ్రస్ లేకుండా చేశాం.. ఉప ఎన్నికలు వస్తే నిన్ను, నీ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తాం. కేటీఆర్.. ఈ సారి మాట్లాడేటప్పుడు నాలుక, ఒళ్ళు దగ్గర పెట్టుకో’’ అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
RK Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్
KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 24 , 2024 | 03:57 PM