Sunitarao: నాకు అవకాశం ఇవ్వండి.. కాంగ్రెస్ మహిళ నేత విజ్ఞప్తి
ABN, Publish Date - Aug 13 , 2024 | 04:28 PM
Telangana: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అద్బుతంగా పనిచేస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి అద్బుతమైన పాలన అందించారన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 13: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అద్బుతంగా పనిచేస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు (Congress Leader Sunita Rao) అన్నారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి అద్బుతమైన పాలన అందించారన్నారు. కాంగ్రెస్ మాత్రమే మహిళలకు న్యాయం చేస్తుందన్నారు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మీరా కుమార్, దీపాదాస్ మున్షీలు ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో మంది కాంగ్రెస్ మహిళా నేతలు గొప్ప గొప్ప స్థానాలకు వెళ్లారన్నారు.
Jogi Ramesh: జోగి రమేష్ అక్రమాలపై షాకింగ్ విషయాలు చెప్పిన ఏసీబీ
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ‘‘నేను పుట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నా, భవిష్యత్‌లోనూ ఉంటా. నా మీద బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినన్ని కేసులు ఎవరిమీద పెట్టేలేదు. గోషామహాల్ లాంటి సీటులో ఓడిపోతానని తెలిసినా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ చేసా. చాలా మంది నేతలకు పదవులు ఇస్తున్నారు అందులో ఓడిన నేతలు ఉన్నారు. నాకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ సునీతరావు అన్నారు.
కంటతడి...
నిన్న కూడా మీడియాతో మాట్లాడిన సునీతరావు పార్టీలో గౌరవం దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. ‘‘రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏం అయ్యింది? గతంలో మహిళ కాంగ్రెస్‌కి పెద్దగా ప్రియారిటీ లేకుండే.. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నా కర్తవ్యం నిర్వహించాను.. 241 కార్యక్రమాలు నిర్వహించాం. గట్టిగా పని చేస్తుంది అని నమ్మి పార్టీ టిక్కెట్ ఇచ్చింది.. గోషామహల్ టిక్కెట్ వద్దన్న కూడా ఇచ్చారు.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగింది. టిక్కెట్ ఇచ్చిన వారికి పదవులు లేవు అన్నారు. ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలును మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌కి వస్తా అని ఇంచార్జీ దీప దాస్ మున్షీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఏ పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తాం. మహిళ కాంగ్రెస్‌లో ఒక్కరికీ పదవి రాలేదు’’ అని సునీత రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Stock Market: స్వల్ప నష్టాల్లో సూచీలు.. అప్రమత్తంగా నిఫ్టీ, సెన్సెక్స్..!
New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 13 , 2024 | 04:31 PM