Srinivasreddy: సినీ నటులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:19 PM
Telangana: తెలుగు సినీ నటులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు కష్టాలు వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్, వస్తారని నమ్మకం లేదని.. ఈ నటుల కంటే సోనూ సూద్ నయమన్నారు. ఈ నటుల కంటే సమంత, మంచు లక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ రాజకీయాలు అల్లు అర్జున్ వివాదం చుట్టూనే తిరుగుతున్నాయి. అల్లు అర్జున్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. గొప్ప వాళ్ళం అని విర్రవీగే సినీ నటులకు ఎమ్మెల్యే యెన్నెం సూటి ప్రశ్న వేశారు. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్‌ను దత్తత తీసుకున్నారా అని నిలదీశారు. సామాజిక అంశాలపై స్పందించడానికి కూడా సినీ నటులు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారన్నారు. పిల్లలకు పుస్తకాలు ఇద్దామని అంటే తనకేం వస్తుందని ఒక నటుడు అన్నారన్నారు. సినీతారలు రాతి హృదయంతో ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు.
Narayana: అనుకున్న ప్రకారమే రాజధాని పూర్తి.. తగ్గేదేలే అన్న మంత్రి
ముప్పై వేల జీతం వచ్చినా మూడు వేల రూపాయలతో టికెట్ కొని సినీతారల స్టార్ డం కాపాడుతున్నారన్నారు. ప్రజలకు కష్టాలు వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ వస్తారని నమ్మకం లేదని.. ఈ నటుల కంటే సోనూ సూద్ నయమన్నారు. ఈ నటుల కంటే సమంత, మంచు లక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారని తెలిపారు. వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ కృత్రిమ సమాజంలో బతుకుతున్నారన్నారు. అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీల్లో నటులు ఉంటారన్నారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే కనీసం ఒక్కరూ కూడా స్పందించరని మండిపడ్డారు. పాపులారిటీలో సినీ నటుల కంటే రాజకీయ నాయకులు తక్కువగా కనిపిస్తారు కానీ ప్రజా సంబంధాల విషయంలో తామే చాలా బెటర్ అని అన్నారు. ప్రజలను మనుషులుగా చూడాలని ఎమ్మెల్యే హితవుపలికారు.
తమిళ నటులకు ఉన్న సామాజిక స్పృహ తెలుగు నటులకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇండియాలో రికార్డు హిట్స్ ఇచ్చాం కదా అని అన్నారు. వైద్యానికి, చదువుకి దాచుకున్న డబ్బులతో వాళ్ళ సినిమాలకి వెళ్తే అభిమానుల గుండెల్లో గుణపాలు దించుతున్నారంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ నటులను, టెక్నిషియన్లను రెండు మూడు కుటుంబాలు తొక్కేస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చారో లెక్క తీద్దామా అని అన్నారు. ‘‘సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా చర్చకు వస్తే నేను తెలంగాణకు జరిగిన అన్యాయంపై లెక్కలు బయట పెట్టడానికి రెడీ’’ అంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి...
నోటీసులకు స్పందించిన పేర్ని నాని కుటుంబం..
గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 23 , 2024 | 04:21 PM