ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: మిమల్ని ధీటుగా ఎదుర్కొంటాం.. కేటీఆర్‌పై అద్దంకి ఫైర్..

ABN, Publish Date - Aug 05 , 2024 | 05:18 PM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుందని.. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు.

KTR and Addanki Dayakar

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుందని.. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్ చేతకానితనం వలనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారని, తప్పని పరిస్థితుల్లో వాళ్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నామన్నారు. కాంగ్రెస్‌లోకి వస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడడానికి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నీతిగా వ్యవహరించడంలేదన్నారు. బీఆర్‌ఎస్ సరైన పద్ధతులను పాటించడం లేదని అద్దంకి దయాకర్ విమర్శించారు. రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులు తెలంగాణలో మాత్రమే లేవని.. దేశంలో ఇదో ప్రక్రియగా మారిపోయిందన్నారు. టీడీఎల్పీని, సీఎల్పీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్, కేటీఆర్‌కు సిగ్గు అనిపించలేదా అని అద్దంకి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కు చట్టం, న్యాయం ఎందుకు కనిపించలేదన్నారు. రాజకీయాల్లో అందరికీ ఒకటే న్యాయం ఉంటుందని, మీకో న్యాయం, ఇతరులకు మరో న్యాయం ఉండదని అద్దంకి దయాకర్ తెలిపారు. చట్టపరమైన అంశాలను కాంగ్రెస్‌ ధీటుగా ఎదుర్కొగలదని తెలిపారు.

Jagadish Reddy: పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వట్లేదు


కేటీఆర్ ఏమన్నారంటే..

ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాంయిపులపై మాట్లాడారు. తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, హరీశ్‌రావుతో కలిసి న్యాయకోవిదులతో సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్‌ఎస్ న్యాయపోరాటం చేస్తుందని కేటీఆర్ ప్రకటించారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్‌ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందని, బీఆర్‌ఎస్ తరఫున త్వరలోనే సుప్రీం కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. పార్టీ పిరాయింపులకు పాల్పడినవారిపై కోర్టులో పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Niranjan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు భ్రమలు తొలిగాయి


రెండు పార్టీల మధ్య వార్..

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్‌లో చేరగా.. ఒక ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరడంపై బీఆర్‌ఎస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కొంతమందిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా 2/3వ వంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని సీఎల్పీని విలీనం చేసుకున్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడలేదు. ప్రసత్తం బీఆర్‌ఎస్ శాసనసభ పక్షం విలీనం కావాలంటే కనీసం 26 మంది కాంగ్రెస్‌లో చేరాల్సి ఉంటుంది. ఇప్పటికే 9 మంది చేరడంతో ఇంకా 17 మంది సభ్యులు అవసరం. ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్‌ఎస్ కోరుతోంది. తాజాగా ఉప ఎన్నికలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో అద్దంకి దయాకర్ కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.


TS News: ‌వైద్యారోగ్యశాఖ మంత్రికి నీట్ అభ్యర్థుల పేరెంట్స్ లేఖ...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 05:18 PM

Advertising
Advertising
<