Kunamneni:ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ మాత్రమే చేశాం...
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:01 PM
Telangana: ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామ్యం కాదంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ మాత్రమే చేశామని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రభుత్వంలో సీపీఐ (CPI) భాగస్వామ్యం కాదంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ మాత్రమే చేశామని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.
Mpox: ఎంపాక్స్ వ్యాధి వ్యాప్తిపై కేంద్రం అలర్ట్.. స్క్రీనింగ్, టెస్టింగ్‌ల సంఖ్య పెంచాలని ఆదేశం
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించటానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడ్తోందన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించే వాళ్ళమని తెలిపారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపొద్దని విజ్ఞప్తి చేశారు. మానవత్వంతో కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలన్నారు. జాతీయ విపత్తు కింద తెలంగాణకు కేంద్రం 6వేల కోట్లు ఇవ్వాలని... కానీ తమ అంచనా ప్రకారం 10,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లకి, పంట నష్టానికి రూ.10వేలు సరిపోవన్నారు.
Weather Update: తీవ్ర వాయుగుండం.. కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. మరో ఏడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
నష్టపోయిన దానిలో కనీసం సగం అయిన ఇవ్వాలన్నారు. ‘‘మావోయిస్టులు ఏమైనా రాక్షసులా? నక్సల్‌పై అమిత్ షాకు ఎందుకంత కక్ష?’’ అని ప్రశ్నించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. మావోయిస్టుల విషయంలో కేంద్రం మాయలో పడి రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేయకూడదని హితవుపలికారు. సెప్టెంబర్ 11నుంచి 17వరకు రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతామన్నారు. సెప్టెంబర్ 21వ తేదిన భారీ బహిరంగ సభ ఉంటుందని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Mahesh kumar: ప్రతీ హామీ అమలు చేసి తీరతాం
TG News: 4కోట్ల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠా అరెస్ట్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 09 , 2024 | 04:05 PM