ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CS Santhi kumari: ట్యాంక్ బండ్‌పై అదిరిపోనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ABN, Publish Date - May 27 , 2024 | 07:06 PM

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారని, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

CS Santhi kumari

హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారని, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాస రాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో జూన్ 2న ఉదయం రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడంతోపాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.


ట్యాంక్ బండ్‌పై అదిపోనున్న ఉత్సవాలు..

ట్యాంక్ బండ్‌పై సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్దఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్టు సీఎస్ వివరించారు. శిక్షణ పొందుతున్న 5000మంది పోలీస్ అధికారులు బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనున్నారని చెప్పారు. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80స్టాళ్లను ఏర్పాటు చేసి హస్త కళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన పలు వస్తువులలతోపాటు నగరంలోని పేరొందిన హోటళ్లచే ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిల్లల కోసం పలు క్రీడలతో కూడిన వినోదశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకర్షణీయమైన బాణసంచా ప్రదర్శన, లేజర్ షో ఉంటుందన్నారు. ట్యాంక్ బండ్‌పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సమీక్షలో సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

Phone tapping: నా ఓటమికి కేసీఆరే కారణం.. ఆవేదనలో ఎమ్మెల్యే..

AP Elections: అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి.. అసలేం జరిగిందంటే..?

Read latest news and Telangana news here

Updated Date - May 27 , 2024 | 07:09 PM

Advertising
Advertising