Dasoju Sravan: వారికి కోపం వస్తే రేవంత్ దిగిపోవడం ఖాయం
ABN, Publish Date - Jan 27 , 2024 | 07:58 PM
కాంగ్రెస్ నేతలకు కోపం వస్తే ఐదేళ్ల లోపే రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతాడని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్(Dasoju Sravan) హెచ్చరించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు కోపం వస్తే ఐదేళ్ల లోపే రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతాడని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్(Dasoju Sravan) హెచ్చరించారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అధికారం ఎవరి సొత్తు కాదని.. శాశ్వతం కాదని చెప్పారు. శాశ్వతం కాని అధికార అహంకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నరనరాన ఎక్కించుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గల్లీ లీడర్ కన్నా చిల్లరగా రేవంత్ తీరు ఉందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అయినా రేవంత్ తీరును మార్చాలని హితవు పలికారు. గల్లీ పహల్వాన్ భాషను రేవంత్ మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్‌కు ఘోరీ కడతావా..? ఎందుకు కడతావ్..? తెలంగాణ తెచ్చినందుకా....?అని దాసోజ్ శ్రావణ్ హెచ్చరించారు.
Updated Date - Jan 27 , 2024 | 07:58 PM