ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS NEWS: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. నకిలీ మందుల తయారీ రాకెట్‌ గుట్టురట్టు

ABN, Publish Date - Mar 03 , 2024 | 06:30 PM

తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆదివారం నాడు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, నల్గొండ రెండు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసి నకిలీ మందులపై కొరడా జులిపించారు. తప్పుడు ప్రకటనలు ఇస్తున్న షాపులపై అధికారులు దృష్టి సారించారు.

హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆదివారం నాడు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, నల్గొండ రెండు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసి నకిలీ మందులపై కొరడా జులిపించారు. తప్పుడు ప్రకటనలు ఇస్తున్న షాపులపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని శాలిబండలో నకిలీ లేబుల్స్‌తో ఆయిల్ నిల్వలను తయారు చేస్తున్న ఓ ఇంట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు మాయమవుతాయంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, ఆయో ఆర్గానిక్ వాల్‌నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజి ఆయిల్స్ పేరిట నకిలీ లేబుల్స్‌ సృష్టించి మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు.

పక్కా సమాచారంతో నకిలీ ఆయిల్స్‌ తయారు చేసే కేంద్రాలపై రైడ్స్ చేశామని చెప్పారు. నిర్వాహకుల దగ్గరి నుంచి పెద్దమొత్తంలో ఆయిల్ నిల్వలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ రూ. 21 వేలు ఉంటుందన్నారు. అలాగే నల్గొండలో ఇర్కిగూడెం గ్రామం దామెరచర్ల మండలంలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీ దాసరి మల్లయ్య మెడికల్ షాపు నిర్వహిస్తున్నారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. షాపులో 41రకాల నకిలీ టాబెట్లను సీజ్ చేశారు. వీటి విలువ రూ. 45వేలు ఉంటుందని అధికారులు వివరించారు. పట్టుబడ్డ యాంటీ బయోటిక్స్, స్టెరయిడ్స్, అనాల్జెసిక్స్, దగ్గు సిరప్‌లు, యాంటీ అల్సర్, యాంటీ డయాబెటిక్స్, యాంటీహైపెర్టెన్సివ్స్ మందులు ఉన్నాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2024 | 06:59 PM

Advertising
Advertising