ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Batti Vikramarka: మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరం: భట్టి విక్రమార్క

ABN, Publish Date - Jun 25 , 2024 | 01:11 PM

హైదరాబాద్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని, డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదని, కుటుంబ వ్యవస్థలను విచ్చిన్నం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని, డ్రగ్స్ (Drugs) విష ప్రయోగం లాంటిదని, కుటుంబ వ్యవస్థలను విచ్చిన్నం చేస్తుందని డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Batti Vikramarka) పేర్కొన్నారు. మంగళవారం నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో నార్కోటిక్ బ్యూరో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. డ్రగ్స్ సప్లై చేస్తున్న సంఘ విద్రోహ శక్తులు చేతిలో యువత జీవితాలు చిన్నభిన్నమవుతున్నాయని, తెలిసి తెలియని వయసులో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలని తమ అక్రమ ఆదాయం కోసం పిల్లలకు యువతకు డ్రగ్స్ అంటగడుతున్నారన్నారు.


దేశాన్ని బలహీన పరచడానికి దేశద్రోహులు చేస్తున్న ప్రయత్నంగా కూడా డ్రగ్స్‌ను చూడొచ్చునని, అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉందని భట్టి విక్రమార్క అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కెటిక్ బ్యూరోకు ఎంతైనా బడ్జెట్ ఇస్తామని, రాష్ట్రంలో మాదకద్రవ్యాలు వినియోగం రవాణా లేకుండా చేయాల్సిన బాధ్యత నార్కోటిక్ బ్యూరోదే అని ఆయన స్పష్టం చేశారు. అడిగిన వెంటనే నార్కోటిక్ బ్యూరోకు లేదనకుండా అన్ని సమకూర్చామని, భవిష్యత్తులో కూడా ఇస్తామని తెలిపారు. మాదకద్రవ్యాలు నిరోధానికి కేవలం పోలీస్ ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాకుండా ప్రజలు కూడా సహకారం అందించాలన్నారు. ప్రజలు కమిటీలు వేసుకుని ఎక్కడికక్కడ సమాచారం అందిస్తే.. డ్రగ్స్ అరికట్టడం కష్టమేమీ కాదన్నారు.


డ్రగ్స్ ఫెడ్లర్‌లను ఎక్కడికైనా వెళ్లి అరెస్ట్ చేయడానికి పోలీస్ వ్యవస్థకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, అందుకే మనం పోలీసులకు సహకారం అందించాలని భట్టి విక్రమార్క అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను వేసుకోవాలని, గ్రామాల్లో కొత్త వ్యక్తులపై నిఘ ఎల్లప్పుడూ ఉండాలని సూచించారు. విద్యార్థులు, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందని, తాత్కాలిక సంతోషాల జోలికి వెళ్లి బలికావద్దని, విద్యార్థులు అడ్డదారులు తొక్కితే కుటుంబమే కాకుండా సమాజం మొత్తం బాధపడాల్సి వస్తుందన్నారు. డ్రగ్స్ నిరోధానికి ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ కార్యాలయాలకు నోటీసులు

నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలంటూ ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలంగాణ ఎంపీలు

అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 25 , 2024 | 01:15 PM

Advertising
Advertising