ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Liquor Scam::కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన ఈడీ.. సంచలన విషయాలు వెలుగులోకి..!

ABN, Publish Date - Jun 03 , 2024 | 05:16 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Case) ఈడీ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఉంచింది. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై(MLC Kavitha) ఈడీ పలు అభియోగాలు మోపింది.

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Case) ఈడీ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఉంచింది. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై(MLC Kavitha) ఈడీ పలు అభియోగాలు మోపింది. ఈ కేసులో రూ.1100 కోట్ల వ్యాపారం జరిగిందని చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. రూ. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్లు చెప్పింది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని ఈడీ పేర్కొంది. ఈడీ చార్జిషీట్‌లో కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ రికార్డులో లిక్కర్ కేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


అందులో నాకు ఎలాంటి వాటాలేదు..కవిత

‘‘లిక్కర్ పాలసీ రూపకల్పనలో నా తరఫున పాల్గొనాలని బుచ్చిబాబుకు నేను ఎలాంటి అథారైజేషన్ ఇవ్వలేదు. ఇండో స్పిరిట్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు ఎలాంటి వాటాలేదని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి నేను ఎవరితో మాట్లాడలేదు. బుచ్చిబాబు, రాఘవల మధ్య జరిగిన సంభాషణలు చూపిస్తే తనకు గుర్తులేదు, వాళ్ల నెంబర్లు కూడా తెల్వదు. కానీ వాళ్ల మధ్య చాటింగ్ జరిగిందని కవిత ఫోన్ రికార్డులు చూపిస్తున్నాయి. లిక్కర్ పాలసీ రూపకల్పన, లిక్కర్ వ్యాపారం నాకు ఎలాంటి సంబంధం లేదు, నా తరపున ఎవరు ఆప్ పార్టీ నేతలను సంప్రదించలేదు, లంచాలు ఇవ్వలేదు. అరుణ్ పిళ్ళై తన ఫ్యామిలీ ఫ్రెండ్, వారాంతాల్లో తరచూ కలుస్తుంటాం, బతుకమ్మ లాంటి పండుగలు కలిసి నిర్వహించామని కవిత తెలిపింది’’ అని ఈడీ అధికారులు పేర్కొన్నారు.


ఆ ఛానల్లో పెట్టుబడులు పెట్టాలని.. కవిత

’’అరుణ్ పిళ్ళై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కవిత నిరాకరించింది. అరుణ్ పిళ్ళై సమీర్ మహేంద్రను హైదరాబాద్‌లో నాకు పరిచయం చేశాడు. సమీర్ మహేంద్రుతో మాట్లాడిన విషయం నాకు గుర్తు లేదు. ఇండో స్పిరిట్‌లో అరుణ్ పిళ్ళై నా తరపున కార్యకలాపాలు నిర్వహించలేదు. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్లో అభిషేక్‌కు వాటాలు ఉన్న సంగతి నాకు తెలియదు. ఇండియా హెడ్ ఛానల్లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్త నన్ను కోరిన ఇంట్రస్ట్ లేదని చెప్పా. మాగుంట శ్రీనివాస్ రెడ్డి చాలా సందర్భాల్లో కలిశాను.. కానీ మాగుంట రాఘువరెడ్డిని ఒక్కసారి మాత్రమే కలిశానని కవిత చెప్పింది’’ అని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 05:26 PM

Advertising
Advertising