ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఆ వీడియోను షేర్ చేస్తున్నారా? ఈసీ సీరియస్ వార్నింగ్ మీకే..!

ABN, Publish Date - May 15 , 2024 | 09:43 PM

Election Commission of India: హైదరాబాద్ పార్లమెంట్(Hyderabad Parliament Constituency) పరిధిలోని బహదూర్‌పురా పోలింగ్ స్టేషన్‌లో(Bahadurpura Polling Station) రిగ్గింగ్(Election Rigging) జరిగిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోపై ..

Election Commission of India

Election Commission of India: హైదరాబాద్ పార్లమెంట్(Hyderabad Parliament Constituency) పరిధిలోని బహదూర్‌పురా పోలింగ్ స్టేషన్‌లో(Bahadurpura Polling Station) రిగ్గింగ్(Election Rigging) జరిగిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. వైరల్ వీడియోపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటిది కాదని స్పష్టం చేసింది. ఇది పాత వీడియో అని వివరణ ఇచ్చింది. అది గతంలో వేరే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటన అని.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినది కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయంది. ఎన్నికల్లో ఎలాంటి రిగ్గింగ్ జరగలేదని స్పష్టం చేసింది. ఇలాంటి పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.


కాగా, మంగళవారం నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో బహదూర్‌పురా పోలింగ్ స్టేషన్ అని.. ఎంఐఎం నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో వీడియోపై జనాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. నిజమేనని చాలా మంది భావించి.. షేర్ల మీద షేర్స్ చేస్తున్నారు. ఈ వీడియో విషయం కాస్తా ఈసీ దృష్టికి వెళ్లడంతో అసలు విషయం చెప్పేసింది.

For More Telangana News and Telugu News..

Updated Date - May 15 , 2024 | 09:43 PM

Advertising
Advertising