ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fake Online Loan Apps: స్కోర్ అనలైజర్ యాప్ ఓపెన్ చేస్తే అంతే సంగతులు

ABN, Publish Date - Jul 01 , 2024 | 09:26 PM

గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి స్కోర్ ఆనలైజర్. ఇది చైనా యాప్.. ఒక్కసారి మీరు దీనిని ఇన్ స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు. వెంటనే గమనించి డీలేట్ చేయాలి. లోన్ కోసం ట్రై చేస్తూ.. కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్, మెక్రో కెమెరాకు పర్మిషన్ ఇచ్చారో.. అంతే సంగతులు. మీ డేటా మొత్తం లోన్ యాప్ చేతిలో ఉంటుంది.

Fake Loan App

మీకు అర్జెంట్‌గా డబ్బులు అవసరం వచ్చిందా..? ఫ్రెండ్స్‌ని అడిగి విసిగి పోయారా..? లోన్ యాప్ ఇన్‌స్టాల్ చేశారా..? ఒక్క నిమిషం ఆగండి. ఆ లోన్ యాప్ గురించి తెలుసకోండి. ఫేకో.. కాదో తెలుసుకోండి. లేదంటే లోన్ యాప్ మాయలో పడటం ఖాయం. ఒక్కసారి లోన్ తీసుకుంటే చాలు సైబర్ కేటుగాళ్ల వేధింపులకు గురికావడం పక్కా.


ఫేక్ లోన్ యాప్

గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి స్కోర్ ఆనలైజర్. ఇది చైనా యాప్.. ఒక్కసారి మీరు దీనిని ఇన్ స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు. వెంటనే గమనించి డీలేట్ చేయాలి. లోన్ కోసం ట్రై చేస్తూ.. కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్, మెక్రో కెమెరాకు పర్మిషన్ ఇచ్చారో.. అంతే సంగతులు. మీ డేటా మొత్తం లోన్ యాప్ చేతిలో ఉంటుంది.


స్కోర్ అనలైజర్..

మిగతా లోన్ యాప్స్ కాస్తా బెటరే.. స్కోర్ అనలైజర్ అలా కాదు. మీరు లోన్ కోసం అప్లై చేస్తే తక్కువ నగదు చూపిస్తోంది. అప్పుడే మీరు గ్రహించాలి. ఉదహరణకు రూ.10 వేలకు దరఖాస్తు చేస్తే రూ.5 వేలు మాత్రమే ఇస్తోంది. అందులో రూ.3 వేలు ఇచ్చి.. రూ.2 వేలు కట్ చేసుకుంటుంది. కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఇస్తోంది. గడువులోగా రూ.5 వేలు కట్టాలి. దాంతో మీరు చైనా లోన్ యాప్‌లో ఇరుకున్నట్టే అవుతుంది.


తిరిగి కట్టే వీలు లేదు

మిగతా లోన్ యాప్స్ మాదిరిగా యాప్ ఓపెన్ చేసే కట్టే వీలుండదు. చూడటానికి ఫోన్ పే, గూగుల్ పే ఉంటుంది. బిల్ కట్టలేరు. పేటీఎం ఉంటుంది.. కనెక్ట్ అవుతుంది.. కస్టమర్‌ను అలర్ట్ చేస్తుంది. డబ్బులు వెళతాయి.. క్రెడిట్ అవుతుందో లేదో అనే భయం ఉంటుంది. ఇక నాలుగో రోజు సైబర్ కేటుగాళ్లు సీన్‌లోకి వస్తారు. మీ లోన్ ఉంది కదా.. కట్టాలని చెబుతారు. ఎలాగూ యాప్ నుంచి కట్టేందుకు వీలు కావడం లేదని కస్టమర్ భావిస్తారు. ఎలా కట్టాలని అడిగితే పర్సనల్ నంబర్‌కు సంబంధించి యూపీఐ ఐడీ ఇస్తారు. అలా డబ్బులు కట్టారో ఇక అంతే సంగతులు. ఆ మరునాటి నుంచి మీకు పేమెంట్ కట్టాలని వేధింపులు ఎక్కువ అవుతాయి.


ఫొటోలు, వీడియోలు

లోన్ కడతావా లేదంటే న్యూడ్ ఫొటోలు, వీడియోలు సెండ్ చేయాలా అని అడుగుతారు. దాంతో కొందరు భయపడి ఎంత అడిగితే అంత నగదు కడతారు. సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి ఎంత అడిగితే అంత పే చేస్తారు. అలా కాకుండా.. భయ పడకుండా వాట్సాప్ చాట్, మొబైల్‌లో అన్ నోన్ కాల్స్ బ్లాక్ చేయాలి. దాంతో మీరు సేఫ్ అవుతారు. దాంతోపాటు సోషల్ మీడియా అకౌంట్స్ డీ యాక్టివేట్ చేయాలి. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలి. పోలీసులను కంప్లైంట్ చేయడంతో వేధింపులు తగ్గుముఖం పడతాయి.

Updated Date - Jul 01 , 2024 | 09:27 PM

Advertising
Advertising