Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్ వరకు
ABN, Publish Date - Jun 08 , 2024 | 08:03 AM
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు.
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు.
వ్యక్తిగత జీవితం..
చెరుకూరి రామోజీ రావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్‌వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్‌ను నెలకొల్పారు. ముఖ్యంగా ఈనాడు, హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కు కూడా ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రామోజీరావు చిన్న కుమారుడు చెరుకూరి సుమన్ లుకేమియాతో 2012 సెప్టెంబర్ 7న మరణించిన సంగతి తెలిసిందే.
ఏం అవార్డులు పొందారంటే..
రామోజీరావు తెలుగు సినిమాలో రచనలకు గాను నాలుగు సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఐదు నంది అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డు సైతం ఆయన్ని వరించాయి. 2016లో, జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషన్, పద్మ విభూషణ్ అందుకున్నారు.
ముఖ్యంగా ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. రామోజీ ఫిల్మ్ సిటీని నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఏటా అక్కడ చాలా సినిమాలు చిత్రీకరిస్తుంటారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సహా అన్ని భాషలకు చెందిన సినిమా షూటింగులు అక్కడ తీస్తుంటారు. ఉషోదయ మూవీస్ ద్వారా ఆయన పలు సినిమాలు తీశారు. రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకంగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. ప్రతి రోజు వేల మంది సందర్శించేందుకు వస్తుంటారు.
రామోజీరావు మృతిపై పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jun 08 , 2024 | 08:07 AM