TG NEWS: యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు యువకులు మృతి
ABN, Publish Date - Dec 07 , 2024 | 07:32 AM
యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ పరిధిలో అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ(శనివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ పరిధిలో అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉండగా.. మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. యువకులంతా హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌లుగా పోలీసులు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - Dec 07 , 2024 | 08:00 AM