ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN, Publish Date - Dec 26 , 2024 | 01:26 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను ఇండియా లెవల్‌లో కాకుండా ప్రపంచ స్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.

FDC Chairman Dilraju

హైదరాబాద్, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (FDC Chairman) మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య ఎఫ్‌డీసీ చైర్మన్‌గా తాను ముందు ఉండి నడిపించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం ఉందని.. తెలుగు సినిమాను ఇండియా లెవల్‌లో కాకుండా ప్రపంచ స్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని చెప్పారని అన్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. డ్రగ్స్ విషయంలో కూడా సినీ పరిశ్రమ ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారని.. నటీనటులతో డ్రగ్స్ నిర్మూలనపై కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని అపోహలు ఉన్నాయని.... సంధ్య థియేటర్ ఘటన తరువాత అలాంటి చర్చకు దారి తీసిందని తెలిపారు.


ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ కలిసి పని చేస్తాయని చెప్పారు. ఇండస్ట్రీ, ఎఫ్‌డీసీ, ప్రభుత్వం కలిపి ఒక కమిటీ వేస్తారని.. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఉంటుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన తెలంగాణ బ్రాండ్‌ను పెంచేందుకు ఇండస్ట్రీ తరపున తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

TG Highcourt: గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టు ఏం చెప్పిందంటే


బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు అనేది చాలా చిన్న విషయమని చెప్పుకొచ్చారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు. సంక్రాంతి సినిమాలకు టిక్కెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు ముఖ్యం కాదన్నారు. తమకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద టాస్క్ ఇచ్చారని.. దాన్ని తాము రీచ్ కావాలి అని అన్నారు. పోలీసుల నుంచి సహకారం ఉంటుందని చెప్పారన్నారు. తెలంగాణా బ్రాండ్‌ను పెంచాలని.. అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్‌లు చేసుకునేలా చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ హబ్‌గా ఎలా చేయాలనేది దానిపై ఆలోచిస్తున్నామని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 01:47 PM