Congress: గ్రేటర్‌లో గులాబీ పార్టీకి బిగ్ షాక్.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్?
ABN, Publish Date - Jul 12 , 2024 | 09:30 AM
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్... ఆ తరువాత బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేసే పనిలో పడింది. కారు పార్టీలోని నేతల్లో వీలైనంత మందిని లాగేసుకోవాలని కాంగ్రెస్ గట్టి టార్గెట్‌నే పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, జూలై 12: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్... ఆ తరువాత బీఆర్‌ఎస్‌ను (BRS) ఖాళీ చేసే పనిలో పడింది. కారు పార్టీలోని నేతల్లో వీలైనంత మందిని లాగేసుకోవాలని కాంగ్రెస్ గట్టి టార్గెట్‌నే పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. కిందస్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు అందరినీ తమ పార్టీలోకి చేర్చుకునే దిశగా హస్తం పార్టీ ముందడుగు వేస్తోంది.
Chandrababu 4.0: చంద్రబాబు నెల రోజుల పాలన ఎలా ఉంది..?
ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా మరికొంత మంది కారు పార్టీ నేతలు.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ఈరోజు, రేపు అధికార పార్టీలో చేరికలు జరుగనున్నాయి.
Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..
నేడు ప్రకాష్.. రేపు గాంధీ
ఈరోజు సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలాగే రేపు (శనివారం) గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇంతే కాకుండా... ఒకటి రెండు రోజుల్లో ఐదుగురు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతల చర్చలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి మంచి ముహూర్తాల కోసం ఎమ్మెల్యేలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24 తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలలోపే చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది.
ఇవి కూడా చదవండి..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 12 , 2024 | 09:53 AM