ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: గన్ పార్క్ వద్దకు కేసీఆర్.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం..

ABN, Publish Date - Jun 01 , 2024 | 10:01 PM

తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన వారికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు శనివారం గన్‌పార్క్‌లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సచివాలయ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన వారికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు(Former CM KCR) శనివారం గన్‌పార్క్‌(Gunpark)లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సచివాలయ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు.


‘జై తెలంగాణ’ పదాన్ని ఎప్పుడూ ఉచ్చరించని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం అవమానకరమన్నారు. అందుకే వేడుకలను బహిష్కరించాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించిందన్నారు. బహిష్కరణకు గల కారణాలను వివరిస్తూ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు.. సీఎం రేవంత్ రెడ్డికి వివరణాత్మక లేఖ రాశారని ఆయన తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌పై స్పందిస్తూ జూన్ 4న ఫలితాల కోసం వేచి చూడాలన్నారు.

ఇది కూడా చదవండి:

Telangana: కేసీఆర్ పాకిస్థాన్ వాళ్లల్లా ప్రవర్తిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

Updated Date - Jun 01 , 2024 | 10:04 PM

Advertising
Advertising