ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

ABN, Publish Date - Jul 25 , 2024 | 12:33 PM

Telangana Budget: మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.

BRS Chief KCR

హైదరాబాద్, జూలై 25: మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి.

AP Politics: వైసీపీలో మొదలైన రాజీనామాల పర్వం.. ఏలూరులో ఇద్దరు నేతలు గుడ్‌బై..


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్ కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.


అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?... లేదా? అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని.. తరువాత సభకు దూరంగా ఉండనన్నట్లు సమాచారం. మరి మరికొద్దిరోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా?.. లేరా..? అనేది వేచి చూడాలి.

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు..



కాగా... మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి నివాసం ప్రజాభవన్‌లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులను భట్టి దంపతులు తీసుకున్నారు. అలాగే రూ.2 లక్షల 95 వేల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.


ఇవి కూడా చదవండి..

Flooding of Projects: తెలంగాణలో ప్రాజెక్టులకు పోటెత్తుతున్నవరద..

Home Minister Anitha: గంజాయి మత్తులో అనేక దారుణాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2024 | 12:58 PM

Advertising
Advertising
<