Harish Rao: మూసీ మురికికూపానికి కారణం మీరు కాదా..
ABN, Publish Date - Nov 08 , 2024 | 10:36 AM
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్న మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. మూసీ మురికికూపంగా మారడానికి కాంగ్రెస్ పాలనే కారణమని అన్నారు. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
హైదరాబాద్, నవంబర్ 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (శుక్రవారం) మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. దాదాపు 2.5 కిలోమీటర్లు కాలినడకన మూసీ నది కుడి ఒడ్డున ఉన్న భీమలింగం కత్వా వరకు పాదయాత్ర చేస్తారు. అయితే ముఖ్యమంత్రి పాదయాత్రపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం పాదయాత్ర సందర్భంగా జరుగుతున్న ముందస్తు అరెస్ట్‌లపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ మురికికూపంగా మారడానికి కాంగ్రెస్ పాలనే కారణమని అన్నారు. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. ఈ మేరకు ఎక్స్‌లో హరీష్‌రావు పోస్టు చేశారు.
Hyderabad: సీబీఐ అధికారినని బెదిరించి.. ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.48 లక్షలు కాజేశారు..
హరీష్ ట్వీట్ ఇదే..
సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన తమరి పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదన్నారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. మూసీ మురికి కూపంగా మారడానికి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా అని ప్రశ్నించారు.
‘‘పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్ పార్టీ పాపం పోదు రేవంత్ రెడ్డి.. పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, మీ పాదయాత్ర మరొక దగ్గర. హైదరాబాదులో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా. దమ్ముంటే.. హైదరాబాద్ నుంచి మీ పాదయాత్ర మొదలు పెట్టండి. మీ పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే.. ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి.. మీ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరం. అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన మా పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి’’ అంటూ హరీష్ రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.
Guntur: కొమెరపూడి.. టీచర్లకు నిలయం
మరోవైపు ఈరోజు మధ్యాహ్నం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రేవంత్ దర్శించుకోనున్నారు. ఉదయం బేగంపేట విమాశ్రయం నుంచి హెలీకాఫ్టర్‌లో యాద్రాద్రికి వెళ్లనున్నారు. యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని.. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఆపై వలిగొండ మండలం సంగెంకు పాదయాత్ర చేయనున్నారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర సీఎం పాదయాత్ర చేస్తారు. మూసీ నది కుడి ఒడ్డున ఉన్న భీమలింగం కత్వాకు.. అక్కడి నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం- నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
ఇవి కూడా చదవండి...
Revanth Birthday: అదిరిపోయేలా రేవంత్ బర్త్‌డే కానుక.. మీరూ ఓ లుక్కేయండి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 08 , 2024 | 10:48 AM