KTR: ఇది ముమ్మాటికీ మోసం, నయవంచనే.. సర్కార్‌పై కేటీఆర్ విసుర్లు
ABN, Publish Date - Sep 20 , 2024 | 09:29 AM
Telangana: ‘‘ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేళ బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడు’’...
హైదరాబాద్, సెప్టెంబర్ 20: కాంగ్రెస్ ప్రభుత్వ (Congress) పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS workig President KTR) విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక అంశంపై సర్కార్‌పై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు కేటీఆర్. తాజాగా మరోసారి ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ ట్వీట్..
‘‘ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేళ బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయి. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండ బద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు. నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి.. చేస్తున్నదేంటి.. 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు.. చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు... అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు... ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన.. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ.. నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు. గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు. వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు’’ కేటీఆర్ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
Phone Taping Case.. ఆ ఇద్దరికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు..
ఉద్యోగులపై మరో ట్వీట్...
ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదన్నారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చెయ్యలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చుసిన కేసీఆర్ సర్కార్.. వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడ్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మొండి వైఖరితో 20 లక్షల కుటుంబాలు ఇబ్బందులో ఉన్నాయన్నారు. తక్షణం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేసి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Viral Video: ఐఫోన్ 16 కోసం 20 గంటలు లైన్లో వేచిఉన్న ప్రజలు
Minister Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. వివరాలు ఇవే..
Read Telangana News And Telugu News
Updated Date - Sep 20 , 2024 | 11:33 AM