ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రేవంత్ డబుల్ ఇంజన్‌కు మరో అర్థం ఇదే..

ABN, Publish Date - Oct 23 , 2024 | 10:48 AM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని ఆదేశాలనుసారమే రేవంత్ నడుచుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. బడేభాయ్ ఆజ్ఞలను సీఎం రేవంత్ తూచా తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. అదాని సంతృప్తి కోసం సీఎం ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Former minister KTR

హైదరాబాద్, అక్టోబర్ 23: కాంగ్రెస్ సర్కార్ పాలనను విమర్శించడమే పనిగా ఎక్స్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) పోస్టులు కొనసాగుతోంది. రుణమాఫీ, హైడ్రా, మూసీ ఇలా ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఏకిపారేస్తున్న పరిస్థితి. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) విమర్శలు గుప్పిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు కేటీఆర్. రేవంత్ దృష్టిలో డబుల్ ఇంజన్‌కు మరో అర్థం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

Delhi: దేశ రాజధానిలో దారుణం.. ఆ పనికి ఒప్పుకోలేదని.. బాబోయ్..



ప్రధాని మోదీ, అంబానీపై కూడా బీఆర్‌ఎస్ నేత విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని ఆదేశానుసారమే రేవంత్ నడుచుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. బడేభాయ్ ఆజ్ఞలను సీఎం తూచా తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. అదాని సంతృప్తి కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. అదానికి మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. రేవంత్ చేసే దుర్మార్గాలపై బీజేపీ మౌనం వహిస్తోందంటూ కేటీఆర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

YS Jagan:అమ్మ, చెల్లిపై కోర్టులో జగన్ పిటిషన్.. ఆస్తుల కోసమేనా..?



కేటీఆర్ పోస్టు ఇదే..

‘‘రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజన్ అంటే = మోడీ + అదానీ. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సివన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నారు. మూసీ పుట్టిన ప్రాంతం దామగుండం వద్ద 12 లక్షల చెట్లను నరికేసే, 2900 ఎకరాల అటవీ భూమిని మోదీ ఆదేశాలనుసారం ఆయనకు అప్పగించారు. మూసీ పుట్టే ప్రాంతం నాశనమైన సరే తన బడేభాయ్ ఆజ్ఞను మాత్రం పాటిస్తున్నారు. ఇటు మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు పబ్లిక్ హియరింగ్ నిర్వహించటం ద్వారా అదానిజీని సంతృప్తి పరుస్తున్నాడు. నిజానికి ఈ భూమిని తెలంగాణలో డ్రై పోర్ట్ కోసం కేటాయించటం జరిగింది. కానీ మోదీ + అదానీ కోసం ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మాణం కోసం అదానీకి మేలు చేస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ ప్రాజెక్ట్ సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అన్ని దుర్మార్గాలు, అవినీతిపై బీజేపీ మౌనంగా ఉంటుంది’’ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.


ప్రజలే మరణశాసనం రాస్తారు.. కేటీఆర్ హెచ్చరిక

రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ , మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, లను హౌజ్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటి అని ప్రశ్నించారు. వీరితో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం రేవంత్ సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనమని విమర్శించారు.

Tammineni Sitaram: అధ్యక్షా.. ఇది అక్రమం..


ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదన్నారు. ఇదీ ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వం అంటూ ఆరోపించారు. అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారుకు దుమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని... అప్పుడే గుండెపగిలిన రైతుల ఆవేదన, చుట్టుపక్కల ప్రజల ఆక్రందన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందన్నారు. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి.. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారని హెచ్చరిస్తూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు.


అంబర్‌పేటకు కేటీఆర్

మరోవైపు.. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ అంబర్‌పేటలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బాగ్‌ అంబర్‌పేట్‌కు చేరుకోనున్న మాజీ మంత్రి సాయి బాబా కాలనీలో మర్డర్‌కు గురైన రిటైర్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి వెళ్లనున్నారు. వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించనున్నారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: టాప్ లెస్ కారులో అంబానీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తోందో..

Jeevanreddy: తీవ్ర మనోవేదనలో జీవన్ రెడ్డి.. ఏ క్షణమైనా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 23 , 2024 | 11:05 AM