ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: నీ సావు తెలివితేటలతో.. బంగారు తెలంగాణ బక్కచిక్కిపోతోంది

ABN, Publish Date - Oct 28 , 2024 | 10:49 AM

Telangana: ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్ర ఖజానాపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచుతరితమైంది. దీన్ని ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. ‘‘సంపద పెంచే ఆలోచనలు మావి - ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి’’ అంటూ మండిపడ్డారు.

Former minister KTR

హైదరాబాద్, అక్టోబర్ 28: రాష్ట్ర ఖజానాపై ఆంధ్రజ్యోతి (Andhrajyothy) పత్రికలో వచ్చిన కథనాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (BRS Working President KTR) ఎక్స్‌లో పోస్టు చేశారు. రిజిస్ట్రేషన్లతో వచ్చే ఆదాయం తగ్గుతోందని.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగి తగ్గిపోయిందని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని ఎక్స్‌లో పోస్టు చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ హయాంలో సంపదను ఎలా పెంచాలో ఆలోచనలు చేశామని చెప్పుకొచ్చారు.

Optical Illusion: మీ కళ్లు, బ్రెయిన్ ఎంత షార్ప్?.. ఈ ఫొటోలో హార్స్ రైడర్ ఎక్కడున్నాడో గుర్తించండి..



బంగారు బాతును చేతిలో పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ మండిపడ్డారు. హైడ్రా దెబ్బకు నగరంలో సొంతింటి కలలు నెరవరలేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చర్యలతో రియల్ బూమ్ పడిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కక్కుర్తి నిర్ణయాలతో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయని విమర్శించారు. రేవంత్ పాలనలో రాష్ట్రానికి ప్రతీరోజు నష్టాలను తెచ్చిపెడుతోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

సంపద పెంచే ఆలోచనలు మావి - ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి

మేము బంగారు బాతును చేతిలో పెడితే - మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేడితిరి

నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న - పాతవి అమ్మాలన్న భయమే

నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే

నీ మూసీ ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే

కాసులపై నీ కక్కుర్తి నిర్ణయాలు - రాష్ట్రాని అధోగతిపాలు చెయ్యబట్టే

నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు - నేడు విలవిలలాడుతూ బోసిపోయే

నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే

బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్భాగ్యపు పాలనకు ఇదిగో ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ లెక్కలే సాక్షాలు అంటూ కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఆంధ్రజ్యోతి కథనం..

రాష్ట్రంలో ఖజానా పరిస్థితిపై ఆంధ్రజ్యోతిలో నిన్న కథనం ప్రచురితం అయ్యింది. ‘‘రాష్ట్ర ఖజానాకు రిజిస్ట్రేషన్లతో వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ తగ్గుదల రాబడిలో కోతకు దారితీస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాదితో పోల్చితే బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆదాయం గత ఏడాది ఇదే నెల (రూ.1,162 కోట్లు)తో పోల్చితే 26.15 శాతం తగ్గి రూ.857.83 కోట్లుగా నమోదైంది. అలాగే అక్టోబరులోనూ (26వ తేదీ వరకు) గతేడాది ఇదే నెల రాబడి రూ.1,221.82 కోట్లతో పోల్చితే 24.4 శాతం తగ్గి రూ.923.30 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మే (18.06 శాతం), సెప్టెంబరు (26.15 శాతం), అక్టోబరు (24.4 శాతం) నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాదితో పోల్చితే తగ్గిపోయింది. అయితే ఏప్రిల్‌ ఆదాయంలో 2.5 శాతం, జూన్‌లో 9.58 శాతం, ఆగస్టులో 0.77 శాతం పెరుగుదల నమోదైంది. జూలై నెలలోనే ఆదాయం గత ఏడాదితో పోల్చితే ఏకంగా 38.06 శాతం పెరగడం విశేషం’’ అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది.


ఇవి కూడా చదవండి

Harishrao: ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి: హరీష్ రావు

జగన్‌కు సలహాదారును

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 28 , 2024 | 10:53 AM