KTR: హైడ్రాకు చట్టబద్ధత వెనక ఉంది వాళ్లే...
ABN, Publish Date - Oct 02 , 2024 | 01:02 PM
Telangana: మూసీ బ్యూటీఫికేష్ కాదు.. పక్కా లూటిఫికేషన్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లగాడు పిలిస్తే తెలంగాణకు ఉరికొస్తానన్న రాహుల్ గాంధీ.. ఏడ సచ్చిండు అంటూ ఘాటుగా స్పందించారు. మూసీ రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కాదు.. రాహుల్ గాంధీ ప్రాజెక్ట్ అని సంచనల వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 2: హైడ్రాకు (HYDR) చట్టబద్ధతపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working President KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైడ్రాకు చట్టబద్ధత వెనుక కేంద్రం ఉందని మాజీ మంత్రి కామంట్స్ చేశారు. బీజేపీ పెద్దల సూచనతోనే గవర్నర్ హైడ్రాకు చట్టబద్ధత కల్పించారని అన్నారు. మూసీ బ్యూటీఫికేష్ కాదు.. పక్కా లూటిఫికేషన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లగాడు పిలిస్తే తెలంగాణకు ఉరికొస్తానన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ఏడ సచ్చిండు అంటూ ఘాటుగా స్పందించారు. మూసీ రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కాదు.. రాహుల్ గాంధీ ప్రాజెక్ట్ అని సంచనల వ్యాఖ్యలు చేశారు. పేదలు చనిపోతుంటే.. రాహుల్ గాంధీ ఎక్కడ అని ప్రశ్నించారు. మూసీ మూటలు మాత్రమే రాహుల్ గాంధీకి కావాలన్నారు.
Babar Azam: కెప్టెన్సీ వదిలేసిన బాబర్ ఆజామ్.. అయినా ఆగని ట్రోలింగ్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
రబీ సీజన్ మెదలైనా.. రైతుబంధు ఇప్పటికీ లేదన్నారు. హామీలకు నిధులు లేవు కానీ.. మూసీ ప్రాజెక్ట్ కు నిధులెక్కడవని ప్రశ్నించారు. 16వేల కోట్లతో మెదలైన ప్రాజెక్ట్‌ను లక్షా 50వేలకు పెంచటం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. దమ్ముంటే పరిష్మన్ ఇచ్చిన వారిపై రేవంత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలను ఆక్రమణదారులు, దొంగలుగా చిత్రీకరించటం సరైంది కాదన్నారు. దొంగచాటుగా సర్వేలు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. మూసీ ప్రాజెక్ట్‌తో రాష్ట్రానికి ఒరిరే లాభం ఏంటని అడిగారు. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయిందన్నారు. బిల్డర్ల తరుపున కాదు.. వారి కింద పనిచేసే కార్మికుల పక్షాన మాట్లాడుతున్నామని మాజీ మంత్రి వెల్లడించారు.
మోదీ అంటే రేవంత్‌కు దడ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి దడ అంటూ వ్యాఖ్యలు చేశారు. మూసీ శుద్ధిపై తాము ఏం చేయాలనే దానిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ బాధితెల సంక్షేమంలో ప్రజంటేషన్ ఇస్తామన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య సయోధ్య లేదని.. క్యాబినెట్ విస్తరణ కూడా చేసుకోలేని దద్దమ్మ రేవంత్ అంటూ విమర్శించారు. మూసీ సుందరీకరణపై డీపీఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేదన్నారు. డీపీఆర్ తయారవుతోందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎ: భట్టి విక్రమార్క అబద్ధం చెప్పారన్నారు. డబ్బులు లూటీ చేయటానికి.. కాంగ్రెస్‌కు రిజర్వ్ బ్యాంక్‌గా మార్చటానికే మూసీ ప్రాజెక్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం
పేదల పట్ల ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ముఖ్యమంత్రి మౌనంగా ఉండి ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. 23 సార్లు ఢిల్లీకి పోయి 23 పైసలు కూడా రేవంత్ తీసుకురాలేదని విమర్శించారు. ఖమ్మం వరద బాధితులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. కాళేశ్వం ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు.. అసెంబ్లీలో కేసీఆర్ మూడు గంటలు ప్రజంటేషన్ ఇచ్చారన్నారు. మూసీ సుందరీకరణపై మూడు నిమిషాలు కూడా చెప్పేవారు లేరన్నారు. మూసీ సుందరీకరణతో ప్రభుత్వానికి తిరిగి వచ్చే రెవెన్యూ లేదని మాజీ మంత్రి వెల్లడించారు.
గాంధీకి నివాళులు..
కాగా.. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకు బీఆర్‌ఎస్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘తన సత్యాగ్రహంతో భారతజాతినే కాకుండా ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. గాంధీ మాటలను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజంలోని బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుంది. ఈ అంశంలో పునరాలోచించుకోవాలి. రాష్ట్రంలోని ప్రజలు పేదలంతా బాధపడుతున్నారు. ఇండ్లు కూల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కూలీలు కూడా ఇల్లు కూలగొట్టలేమంటూ తిరిగి వెళ్ళిపోయారు. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించింది నిర్మాణాత్మక పనులు చేయమని.. కానీ విధ్వంసం సృష్టించమని కాదు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వారిపట్ల కర్కషంగా అమామానవీయంతో వ్యవహరిస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఢిల్లీలో ఉన్న ప్రస్తుత గాంధీలు ఈ ప్రభుత్వ అమానవీయమైన పాలనపై స్పందించాలి. డీపీఆర్ అనేది లేకుండా ఇండ్లు కులగొట్టే దుర్మార్గమైన ప్రయత్నాలను విరమింపచేయాలి’’ అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
KTR: ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.. కేటీఆర్ ట్వీట్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 02 , 2024 | 03:08 PM